సహారా ఇన్వెస్టర్ల అన్వేషణకు సెబీ తుది యత్నాలు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేసి... రిఫండ్‌లకు అర్హులైన ఇన్వెస్టర్లను గుర్తించేందుకు నియంత్రణ సంస్థ సెబీ ఆఖరి ప్రయత్నాలు మొదలు పెట్టింది. సహారా ఇండియా రియల్ ఎస్టేట్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు జారీ చేసిన బాండ్‌లలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు తగిన ధ్రువపత్రాలతో సొమ్ము రిఫండ్ దరఖాస్తులను వచ్చే నెల 30 లోగా తమకు సమర్పించాలని పేర్కొంది.
రూ.24 వేల కోట్లమేర నిధుల సమీకరణ కేసులో ఇన్వెస్టర్ల సొమ్మును సహారా వెనక్కివ్వాలని.. ఇందుకు సెబీ తగిన చర్యలు చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. గతేడాది మే నెలలోనే రిఫండ్ ప్రక్రియను సెబీ మొదలుపెట్టింది. అయితే,చాలా నామామాత్రంగా రిఫండ్స్ జరగడంతో మరోసారి ఇన్వెస్టర్లకు సెబీ ప్రకటనను విడుదల చేసింది. ఒరిజినల్ బాండ్ సర్టిఫికెట్/పాస్‌బుక్, గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ ఖాతా వివరాలను ఇన్వెస్టర్లు దరఖాస్తులో వెల్లడించాలని సెబీ పేర్కొంది.