270 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్ క్లోజ్
Published Fri, Aug 18 2017 3:59 PM | Last Updated on Tue, Sep 12 2017 12:25 AM
సాక్షి, ముంబై : ఇన్ఫోసిస్ సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా మార్కెట్లను కుదేలు చేసింది. 400 పాయింట్లు మేర పతనమైన సెన్సెక్స్ చివరికి 270.78 పాయింట్ల నష్టంలో 31524.68 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా తన కీలకమైన మరో మార్కు 9,900ను కోల్పోయింది. ఒకానొక దశలో 9800 కిందకి కూడా పడిపోయింది. చివరికి 66.75 పాయింట్ల నష్టంలో 9837.40 వద్ద క్లోజైంది. సిక్కా అనూహ్య నిర్ణయంతో శుక్రవారం మార్కెట్‌లో ఐటీ స్టాక్స్ ఎక్కువగా నష్టపోయాయి. వాటిలో ఎక్కువగా ఇన్ఫోసిస్ ఇంట్రాడేలో 52 వారాల కనిష్టానికి పడిపోయింది. చివరికి 9.57 శాతం నష్టంలో రూ.923.15 వద్ద ఇన్ఫోసిస్ షేరు ముగిసింది.
నేటి సెషన్‌లో ఎక్కువగా ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ఎక్కువగా లాభాలు పండించాయి. హెచ్‌యూఎల్, ఐటీసీలు ఇండెక్స్‌లలో మంచి లాభాలను అందుకున్నాయి. రెండు సూచీల్లోనూ ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా ఎక్కువగా నష్టపోగా.. హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, బీపీసీఎల్ లాభాలను పొందాయి. అటు యూరోపియన్ స్టాక్స్‌కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Advertisement