Vishal Sikka Resignation
-
సిక్కా ఎఫెక్ట్: ఇన్పీ కో-ఫౌండర్స్ సంపద ఆవిరి
సాక్షి, ముంబై : ఇన్ఫోసిస్ కో-ఫౌండర్స్, విశాల్ సిక్కా దెబ్బ భారీగానే కొట్టింది. సిక్కా దెబ్బకు ఇన్ఫీ షేర్లు కుప్పకూలడంతో, కంపెనీ సహ-వ్యవస్థాపకులు తమ బిలీనియర్ ట్యాగ్ పోగొట్టుకున్నారు. గత రెండు రోజులుగా కంపెనీ షేర్లు నష్టాలు పాలవడంతో ఇన్ఫోసిస్ హై ప్రొఫైల్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణమూర్తి తన బిలీనియర్ స్టేటస్‌ను కోల్పోగా... గోపాలక్రిష్ణన్ కూడా ఆ ట్యాగ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. సీఈవోగా సిక్కా రాజీనామా అనంతరం పతనమవడం ప్రారంభమైన ఇన్పీ షేర్లు, సోమవారం మార్కెట్ ట్రేడింగ్‌కు 14.5 శాతం క్రాష్ అయ్యాయి. దీంతో ఫౌండర్ ప్రమోటర్లు కూడా భారీగా తమ సంపదను కోల్పోయారు. మొత్త ఫౌండర్లు కంపెనీలో 12.74 శాతం వాటాను కలిగి ఉన్నారు. గత గురువారం 1,160 మిలియన్ డాలర్లు(రూ.7,437కోట్లకు పైన)గా ఉన్న గోపాలక్రిష్ణన్ షేర్లు సోమవారం సాయంత్రానికి 998 మిలియన్ డాలర్ల(రూ.6,398 కోట్లు)కు పడిపోయాయి. ఇక నారాయణమూర్తి, ఆయన కుటుంబం రూ.1000 కోట్లకు పైగానే కోల్పోయింది. 800 మిలియన్ డాలర్ల(రూ.5,129కోట్లు)కు పైన ఉన్న నందన్ నిలేకని సంపద కూడా 750 మిలియన్ డాలర్ల(రూ.4,808కోట్లు) కిందకి దిగజారింది. అటు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రెండు రోజుల వ్యవధిలోనే రూ.34వేల కోట్లకు పైగా క్షీణించింది. మొత్తంగా ప్రమోటర్లు రూ.4,321 కోట్లను నష్టపోయారు. ఈ మొత్తం ప్రస్తుతం నందన్ నిలేకని కలిగి ఉన్న సంపదంతగా ఉంది. రూ.30వేల కోట్లగా ఉన్న ఫౌండర్ల షేర్లు, సోమవారం సాయంత్రానికి రూ.25,594 కోట్లకు వచ్చి చేరాయి. సిక్కా దెబ్బకు మూడేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయిన ఇన్ఫీ షేర్లు, మంగళవారం మార్కెట్లో కోలుకున్నాయి. ప్రస్తుతం స్వల్పంగా 0.11శాతం లాభపడుతూ.. రూ.874.30 వద్ద ట్రేడవుతోంది. -
సిక్కా షాక్‌తో రూ.30వేల కోట్లు మటాష్
-
270 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్ క్లోజ్
సాక్షి, ముంబై : ఇన్ఫోసిస్ సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా మార్కెట్లను కుదేలు చేసింది. 400 పాయింట్లు మేర పతనమైన సెన్సెక్స్ చివరికి 270.78 పాయింట్ల నష్టంలో 31524.68 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా తన కీలకమైన మరో మార్కు 9,900ను కోల్పోయింది. ఒకానొక దశలో 9800 కిందకి కూడా పడిపోయింది. చివరికి 66.75 పాయింట్ల నష్టంలో 9837.40 వద్ద క్లోజైంది. సిక్కా అనూహ్య నిర్ణయంతో శుక్రవారం మార్కెట్లో ఐటీ స్టాక్స్ ఎక్కువగా నష్టపోయాయి. వాటిలో ఎక్కువగా ఇన్ఫోసిస్ ఇంట్రాడేలో 52 వారాల కనిష్టానికి పడిపోయింది. చివరికి 9.57 శాతం నష్టంలో రూ.923.15 వద్ద ఇన్ఫోసిస్ షేరు ముగిసింది. నేటి సెషన్లో ఎక్కువగా ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ఎక్కువగా లాభాలు పండించాయి. హెచ్‌యూఎల్, ఐటీసీలు ఇండెక్స్‌లలో మంచి లాభాలను అందుకున్నాయి. రెండు సూచీల్లోనూ ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా ఎక్కువగా నష్టపోగా.. హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్ లాభాలను పొందాయి. అటు యూరోపియన్ స్టాక్స్‌కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. -
సిక్కా షాక్‌తో రూ.30వేల కోట్లు మటాష్
సాక్షి, ముంబై : విశాల్ సిక్కా తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇన్ఫోసిస్ షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. నేటి సెషన్లో ఇన్ఫోసిస్ షేరు విలువ 52 వారాల నష్టంలో 13 శాతం మేర నష్టపోయి, రూ.884.40 వద్ద కనిష్ట స్థాయిలను నమోదుచేస్తోంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా భారీగా తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు రూ.30 వేల కోట్ల మార్కెట్ విలువను ఇన్ఫోసిస్ కోల్పోయింది. గురువారం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,34,554.78 కోట్లగా ఉంది. నేడు అది రూ.30 వేల కోట్ల మేర పడిపోయింది. ఐటీ సర్వీసు కంపెనీల్లో రెండో అతిపెద్ద దిగ్గజంగా ఉన్న ఇన్ఫోసిస్ సీఈవోగా, ఎండీగా విశాల్ సిక్కా గురువారం ఉదయం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ అన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. గత కొంతకాలంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, కంపెనీ మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాతో పాటు ఇతరత్రా కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతన ప్యాకేజీలను భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని ప్రమోటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వివాదాల నేపథ్యంలో విశాల్ సిక్కా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సిక్కా నిర్ణయంతో ఇటు మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక సీఈవోగా వచ్చిన యూబీ ప్రవీణ్ రావు, చాలా పెద్ద సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉందని విశ్లేషకులు చెప్పారు. ఇప్పటికే ఐటీ సెక్టార్ వృద్ధి రేటు మందగించింది. అంతేకాక చాలా దేశాల్లో వీసాలపై పరిమితులు విధిస్తున్నారు. ఇవన్నీ ప్రవీణ్ రావుకు సవాళ్లేనని పేర్కొన్నారు. సిక్కా వైదొలగడం ప్రస్తుతం కంపెనీకి స్వల్పకాలంగా అతిపెద్ద ఎదురుదెబ్బేనని, కానీ ఇన్ఫోసిస్ ఈ ఎదురుదెబ్బను అధిగమిస్తుందని మరికొందరు విశ్లేషకులు అంచనావేస్తున్నారు.