ఊహించని రికవరీ | Sensex Recovers 1433 Pts From Day's Low | Sakshi
Sakshi News home page

ఊహించని రికవరీ

Published Sat, Jun 13 2020 8:40 AM | Last Updated on Sat, Jun 13 2020 8:50 AM

Sensex Recovers 1 433 Pts From Day's Low - Sakshi

స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ శుక్రవారం రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ను తలపించింది. భారీ నష్టాలతో ఆరంభమై, మరింతగా నష్టపోయి, మధ్యాహ్నానికల్లా ఆ నష్టాలను పూడ్చుకొని, చివరకు ఓ మోస్తరు లాభాలతో ముగిసింది. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు పుంజుకోవడం దీనికి ప్రధాన కారణాలు. ఆరంభంలోనే 1,190 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ చివరకు 243 పాయింట్ల లాభంతో 33,781 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 358 పాయింట్లు క్షీణించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 9,973 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 506 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

1,508 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....

ఆరంభంలోనే భారీగా నష్టపోయిన స్టాక్‌ సూచీలు మెల్లమెల్లగా రికవరీ అవుతూ వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చాయి. ఒక దశలో 1,190 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ మరో దశలో 318 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 1,508 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇంట్రాడేలో 358 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఒక దశలో 94 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 452 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 1,433 పాయింట్లు, నిఫ్టీ 429 పాయింట్ల మేర రికవరీ అయ్యాయి. ఆరంభంలో 3.5 శాతం మేర నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు 0.7 శాతం లాభాలతో ముగిశాయి.  ఐటీ, మీడియా సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల నిఫ్టీ సూచీలు లాభపడ్డాయి.   

∙మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 7% లాభంతో రూ.509 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. గత క్యూ4లో రూ.3,255 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతర్జాతీయ అనుబంధ సంస్థల్లో పెట్టుబడులను రైటాఫ్‌ చేయడం, కంపెనీ గైడెన్స్‌ ఆశావహంగా ఉండటంతో ఈ షేర్‌ పెరిగింది.  ∙హెచ్‌–1బీతో సహా కొన్ని ఎంప్లాయ్‌మెంట్‌ వీసాలను రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ట్రంప్‌ యోచిస్తున్నారన్న వార్తలతో ఐటీ షేర్లు 1–3 శాతం మేర పతనమయ్యాయి. 
∙60కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. గ్రాన్యూల్స్‌ ఇండియా, రుచి సోయా, అదానీ గ్రీన్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 
∙రైట్స్‌ షేర్లు సోమవారం(ఈ నెల 15)నుంచి స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల్లో ట్రేడ్‌ కానుండటంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 3 శాతం లాభంతో రూ.1,589 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 243 పాయింట్ల లాభంలో ఈ షేర్‌ వాటాయే 152 పాయింట్లుగా ఉంది.  
∙300కు పైగా షేర్లు అప్పర్‌  సర్క్యూట్లను తాకా యి. అరవింద్‌ ఫ్యాషన్స్, ఫ్యూచర్‌ కన్సూమర్, పీఎన్‌బీ హౌసింగ్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement