
శంషాబాద్ విమానాశ్రయంలో సోలార్ వెలుగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శంషాబాద్ విమానాశ్రయం వద్ద రూ.25 కోట్లతో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్) ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో విమానాశ్రయంలోని టెర్మినల్‌కు అవసరమైన విద్యుత్‌లో 30 శాతం ఈ ప్లాంటు సమకూరుస్తుంది. రెండు మూడేళ్లలో ప్లాంటు సామర్థ్యాన్ని 30 మెగావాట్లకు చేర్చాలన్నది కంపెనీ ప్రణాళిక.