‘ఆక్వాలైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుఖ్ | sharukh khan as the brand ambassador for Aqua Lite | Sakshi
Sakshi News home page

‘ఆక్వాలైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుఖ్

Published Sat, Oct 24 2015 2:47 AM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

‘ఆక్వాలైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుఖ్ - Sakshi

‘ఆక్వాలైట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుఖ్

హైదరాబాద్: ప్రముఖ ఫుట్‌వేర్ కంపెనీ ఆక్వాలైట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వ్యవహరించనున్నారు. షారుఖ్ ఖాన్‌తో జతకట్టడం వల్ల తమ బ్రాండ్ విలువ మరింత పెరుగుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు మరిం త చేరువ అవ్వడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆక్వాలైట్ ఇండియా మార్కెటింగ్ డైరె క్టర్ ఇస్లామ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.600 కోట్లుగా ఉన్న కంపెనీ టర్నోవర్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.1,000 కోట్లకు చేర్చడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. చిన్న పట్టణాలకు విస్తరించే వ్యూహంలో భాగంగా డీలర్స్ సంఖ్యను 1,000కి పెంచుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే మెట్రోలు, ప్రముఖ పట్టణాల్లో సొంత షోరూమ్‌ల సంఖ్యను 100కి చేర్చాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement