
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.6 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పీసీ మోదీ వెల్లడిం చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది సగానికన్నా తక్కువ. అయినప్పటికీ బడ్జెట్‌లో నిర్దేశిత లక్ష్యాలను సాధించగలమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సత్వరం రీఫండ్స్ చేస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రీఫండ్స్ 20% పెరిగాయని ఆయన చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలపైనా దృష్టి పెట్టామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment