న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కూడా తాత్కాలిక డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఆయనను ఈడీ తాత్కాలిక డైరెక్టర్‌గా కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (ఏసీసీ) నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మిశ్రా ఈ పదవిలో మూడు నెలల పాటు కొనసాగనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత‍్వంలోని కేబినెట్ నియామక కమిటీ ఈనియామకాన్ని చేపట్టింది.
కాగా ప్రస్తుతం ఈడీ డైరెక్టర్‌గా కర్నాల్ సింగ్ ఉన్నారు. అయితే ఆయన పదవీ కాలం రేపటితో (ఆదివారం)తో ముగియనుంది. 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన పదవీకాలం మూడేళ్లలో ఈడీ రికార్డు స్తాయిలో ఆస్తులను ఎటాచ్ చేసింది. వీటి విలువ రూ. 33,563 కోట్లు. మరోవైపు పదేళ్ల (2005- 2015 మధ్య) కాలంలో ఈ విలువ 9,003 కోట్లుమాత్రమే. మనీలాండరింగ్ కేసుల విచారణలో 390 చార్జ్‌షీట్లను ఫైల్ చేసింది. ముఖ్యంగా అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ చాపర్స్ కేసు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖమంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు, స్టెర్లింగ్ బయోటెక్, విజయ్ మాల్యా , నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ (పీఎన్‌బీ స్కాం) , 2జీ స్పెక్ట్రం , కోల్ స్కాం తదితర కేసులు ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment