attachments
-
ఓవైపు కేసులు.. మరోవైపు మనవడికి 40 కోట్ల కానుక
బిందు రాణా కపూర్.. యస్ బ్యాంక్ ఫౌండర్, మాజీ ఎండీ రానా కపూర్ భార్య. అక్రమ ధనార్జన కేసు విచారణలో భర్తతోపాటు బిందూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ముడుపులు తీసుకుని పలు సంస్థలకు యస్‌బ్యాంక్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా రుణాలు ఇప్పించారని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేయగా, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఆమె తన తొమ్మిదేళ్ల మనవడికి పుట్టినరోజు కానుకగా 40 కోట్ల విలువైన ఆస్తుల్ని అందించడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని పోష్ ఏరియా జోర్‌బాగ్‌లో తన పేరిట ఉన్న ఆస్తిని.. మనవడు ఆశివ్ ఖన్నా పేరిట రాసింది బిందు రాణా కపూర్. ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ విలువ 40 నుంచి 44 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఆస్తి.. ఆమె తన తండ్రి నుంచి 2004 లో పొందినట్లు డాక్యుమెంట్లలో ఉంది. జప్కీ డాట్‌కామ్ ద్వారా డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చాయి. జులై 31న ఆస్తి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన 36 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు జరిగిందని.. ఆ ఆస్తికి బిందూ కూతురు, ఆశివ్ ఖన్నా తల్లి రాధా కపూర్ గార్డియన్‌గా నియమించినట్లు ఆ చెల్లింపుల్లో ఉంది. ఇది చదవండి: యస్ బ్యాంక్ నష్టం, ఎన్ని కోట్లంటే.. గతేడాది జులైలో యస్ బ్యాంక్ మోసాలు.. మనీలాండరింగ్ కేసులో రెండు వేల కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ ఎటాచ్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో లండన్‌లోని రాణా కపూర్‌కు చెందిన 127 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కూడా ఈ మధ్యే ఎటాచ్ చేసింది. ఇక పోయినవారం రానా కపూర్‌ను వారం కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ యాంటీ కరప్షన్ బ్యూరో కోర్టును కోరిన విషయం తెలిసిందే. కపూర్, ఆయన భార్య బిందు, అవంత రియాలిటీ లిమిటెడ్ గౌతమ్ థారప్లు.. 685 కోట్ల ఆస్తుల్ని కేవలం 375 కోట్ల ఆస్తుల ట్రాన్జాక్షన్ చూపించడాన్ని ఇల్లీగల్‌గా పేర్కొంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. రాణా కపూర్‌తో పాటుఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై ప్రస్తుతం మనీలాండరింగ్ కేసు నడుస్తోంది. -
రిలయన్స్ డీల్‌కు బ్రేక్ : బియానీకి భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్‌తో న్యాయపోరాటంలో ఫ్యూచర్ గ్రూప్‌నకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ రిటైల్‌తో రూ.24,713 కోట్ల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్ విబేధాలకు సంబంధించి సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్ (ఈఏ) 2020 అక్టోబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్ గ్రూప్ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో న్యాయస్థానం పేర్కొంది.(మాల్యా, మోదీ, మెహెల్‌కు నిర్మలాజీ షాక్) కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని, ఈ ఒప్పందంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు జస్టిస్ జెఆర్ మిధా ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూపుకు సంబంధించిన బియానీ, ఇతరుల ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలులో ఎందుకు ఉంచకోడదని ప్రశి్నస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచి్చంది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. -
మాయావతికి ఎదురుదెబ్బ
లక్నో: బీఎస్పీ చీఫ్ మాయావతికి ఎదురుదెబ్బ తగిలింది. మాయావతి సోదరుడు, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆనంద్‌కుమార్, అతని భార్యకు చెందిన 400 కోట్ల రూపాయల ఆస్తులను ఆదాయ పన్నుశాఖ ఢిల్లీ విభాగం ఎటాచ్ చేసింది. బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం, 1988 ప్రకారం జులై 16న తాత్కాలిక నోటీసులు జారీ చేశామని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. నోయిడాలో ఏడు ఎకరాల్లో విస్తరించిన వున్న ప్లాట్‌ను బినామీ ఆస్తిగా పరిగణించిన ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీని విలువ సుమారు రూ. 400 కోట్లు. కాగా బినామీ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి ఏడు సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష లేదా బినామి ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
మెహుల్ చోక్సీకి ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు, గీతాంజలి అధినేత మెహుల్‌చోక్సీకి మరో షాక్ తగిలింది. దుబాయ్‌లో చోక్సీకి చెందిన విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. దుబాయ్‌లోని మూడు వాణిజ్య ఆస్తులను, అతి విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ ఈ280, కారును, 24.8 కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లను ఎటాచ్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చర్య తీసుకుంది. కాగా 14వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కాంలో మెహుల్ చోక్సీ కిలక నిందితుడుగా ఉన్నాడు. చోక్సీపై కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐలు దర్యాప్తు చేస్తున్నాయి. చోక్సీ పాస్‌పోర్టు రద్దు చేయడంతోపాటు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆంటిగ్వాలో తలదాచుకున్న చోక్సీని తిరిగి భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసులో మరో కీలక నిందితుడు చోక్సీ మామ, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ED attaches under PMLA, 3 commercial properties in Dubai, valuables, 1 Mercedes Benz E280 and Fixed Deposit totaling to Rs. 24.8 crores of accused Mehul Choksi in a #Bankfraud case. — ED (@dir_ed) July 11, 2019 -
మూడేళ్లలో రికార్డు ఎటాచ్‌లు : ఈడీకి కొత్త బాస్
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు కూడా తాత్కాలిక డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఆయనను ఈడీ తాత్కాలిక డైరెక్టర్‌గా కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (ఏసీసీ) నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మిశ్రా ఈ పదవిలో మూడు నెలల పాటు కొనసాగనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ ఈనియామకాన్ని చేపట్టింది. కాగా ప్రస్తుతం ఈడీ డైరెక్టర్‌గా కర్నాల్ సింగ్ ఉన్నారు. అయితే ఆయన పదవీ కాలం రేపటితో (ఆదివారం)తో ముగియనుంది. 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన పదవీకాలం మూడేళ్లలో ఈడీ రికార్డు స్తాయిలో ఆస్తులను ఎటాచ్ చేసింది. వీటి విలువ రూ. 33,563 కోట్లు. మరోవైపు పదేళ్ల (2005- 2015 మధ్య) కాలంలో ఈ విలువ 9,003 కోట్లుమాత్రమే. మనీలాండరింగ్ కేసుల విచారణలో 390 చార్జ్షీట్లను ఫైల్ చేసింది. ముఖ్యంగా అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ చాపర్స్ కేసు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖమంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు, స్టెర్లింగ్ బయోటెక్, విజయ్ మాల్యా , నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ (పీఎన్బీ స్కాం) , 2జీ స్పెక్ట్రం , కోల్ స్కాం తదితర కేసులు ఇందులో ఉన్నాయి. -
భారీ సైబర్ దాడి: ఆ ఫైల్ ఓపెన్ చేయకండి!
వాషింగ్టన్ : వనా క్రై ర్యాన్సమ్ వేర్ రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తున్న సైబర్ దాడి నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఈ బారి నుంచి తప్పించుకోవడానికి రెడ్ కాలర్డ్ క్రిటికల్ అలర్ట్ ను జారీచేస్తున్నాయి. అయితే ఈ సైబర్ దాడి ముప్పున పడకుండా ఉండేందుకు ''tasksche.exe'' పేరుతో వచ్చే ఎలాంటి ఈ-మెయిల్ అటాచ్ మెంట్లను ప్రజలు ఓపెన్ చేయొద్దని సైబర్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాక .exe ఎక్స్ టెన్షన్ తో వచ్చే ఎలాంటి ఫైల్స్ ను ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఈ ఫైల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్టర్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ''tasksche.exe'' అనే ఎన్ స్క్రిప్షన్ వైరస్ అత్యంత ప్రమాదకరమైన ర్యాన్సమ్ వేర్ దాడికి పాల్పడే వైరస్ అని, ఇది పీసీలోని అన్ని ఫైల్స్ లోకి చొరబడి, బాధితుల దగ్గర్నుంచి మనీని లాగుతుందని తెలిపారు. ప్రమాదకర అటాచ్మెంట్స్, ఈమెయిళ్ల ద్వారా ఈ మాల్వేర్ కంప్యూటర్లలోకి చొరబడి అందులో ఉన్న డేటాను ఎన్‌క్రిప్ట్ చేసేస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా విండోస్ సిస్టమ్స్‌కే ఎటాక్ అవుతుంది. ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ మాల్ వేర్, దాదాపు 150 దేశాల్లో సుమారు రెండు లక్షల కంప్యూటర్లను హ్యాక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇది వేగంగా విస్తరిస్తోంది.