భారీ సైబర్ దాడి: ఆ ఫైల్ ఓపెన్ చేయకండి!
భారీ సైబర్ దాడి: ఆ ఫైల్ ఓపెన్ చేయకండి!
Published Mon, May 15 2017 12:21 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
వాషింగ్టన్ : వనా క్రై ర్యాన్సమ్ వేర్ రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తున్న సైబర్ దాడి నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఈ బారి నుంచి తప్పించుకోవడానికి రెడ్ కాలర్డ్ క్రిటికల్ అలర్ట్ ను జారీచేస్తున్నాయి. అయితే ఈ సైబర్ దాడి ముప్పున పడకుండా ఉండేందుకు ''tasksche.exe'' పేరుతో వచ్చే ఎలాంటి ఈ-మెయిల్ అటాచ్ మెంట్లను ప్రజలు ఓపెన్ చేయొద్దని సైబర్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాక .exe ఎక్స్ టెన్షన్ తో వచ్చే ఎలాంటి ఫైల్స్ ను ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఈ ఫైల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్టర్ చేస్తున్నాయని పేర్కొన్నారు.
''tasksche.exe'' అనే ఎన్ స్క్రిప్షన్ వైరస్ అత్యంత ప్రమాదకరమైన ర్యాన్సమ్ వేర్ దాడికి పాల్పడే వైరస్ అని, ఇది పీసీలోని అన్ని ఫైల్స్ లోకి చొరబడి, బాధితుల దగ్గర్నుంచి మనీని లాగుతుందని తెలిపారు. ప్రమాదకర అటాచ్‌మెంట్స్, ఈమెయిళ్ల ద్వారా ఈ మాల్‌వేర్ కంప్యూటర్లలోకి చొరబడి అందులో ఉన్న డేటాను ఎన్‌క్రిప్ట్ చేసేస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా విండోస్ సిస్టమ్స్‌కే ఎటాక్ అవుతుంది. ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ మాల్ వేర్, దాదాపు 150 దేశాల్లో సుమారు రెండు లక్షల కంప్యూటర్లను హ్యాక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇది వేగంగా విస్తరిస్తోంది.
Advertisement