
స్నాప్‌డీల్, హెచ్‌డీఎఫ్‌సీల కో బ్రాండెడ్ ఈ కామర్స్ క్రెడిట్ కార్డ్
హైదరాబాద్: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు విసా సహకారంతో కో-బ్రాండెడ్ ఈ కామర్స్ క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చాయి.ఈ కార్డ్‌తో ఆన్‌లైన్ చెల్లింపులు సులభతరంగా చేసుకోవచ్చని స్నాప్‌డీల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్డ్‌ద్వారా చెల్లింపులు చేసేవారికి రివార్డ్ పాయింట్లను కూడా ఇస్తామని పేర్కొంది. ఈ కార్డ్ కోసం స్నాప్‌డీల్ (వెబ్‌సైట్, మొబైల్ యాప్)ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించింది.