
ఐటీ ఆఫీసు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ తన ఉద్యోగులకు డ్రస్ కోడ్ ప్రకటించింది. ‘ఆపరేషన్ డ్రస్ కోడ్’ ను తన ఉద్యోగులందరికీ అమల్లోకి తెస్తున్నట్టు ఐటీ డిపార్ట్‌మెంట్ బుధవారం పేర్కొంది. ఐటీ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఈ మేరకు ఓ అధికారిక ఆర్డర్‌ను జారీచేశారు. ఈ ఆర్డర్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్ అధికారులదరూ, స్టాఫ్ మెంబర్లూ, ఇతర అధికారులు వర్క్‌ప్లేస్‌లో చక్కగా, శుభ్రంగా, ఫార్మల్‌లో కనిపించాలని పేర్కొన్నారు. అత్యధిక మొత్తంలో ఉన్న ఉద్యోగుల్లో, ముఖ్యంగా డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే యువకులు ఆఫీసుకు సాధారణ దుస్తుల్లో వస్తున్నారని, ఇది వారి దగ్గర్నుంచి ఊహించనిదని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ తన ఆర్డర్‌లో అన్నారు.
ఇక నుంచి అధికారులు, స్టాఫ్ మెంబర్లందరూ ఫార్మల్‌గా, క్లీన్‌గా, మంచి దుస్తుల్లో ఆఫీసుల్లో కనిపించాలని ఆదేశించారు. ఆఫీసుకు సాధారణ దుస్తుల్లో రావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే, వారిపై చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాక వారిని సాధారణ వస్త్రాలు మార్చుకుని, ఫార్మల్‌గా రావడం కోసం తిరిగి ఇంటికి కూడా పంపనున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment