ఫుల్‌ట్యాంక్‌ ఆన్‌డిమాండ్‌ కార్‌ సర్వీస్‌ | special story on full tank app | Sakshi
Sakshi News home page

ఫుల్‌ట్యాంక్‌ ఆన్‌డిమాండ్‌ కార్‌ సర్వీస్‌

Published Mon, Jan 23 2017 1:42 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

ఫుల్‌ట్యాంక్‌ ఆన్‌డిమాండ్‌ కార్‌ సర్వీస్‌ - Sakshi

ఫుల్‌ట్యాంక్‌ ఆన్‌డిమాండ్‌ కార్‌ సర్వీస్‌

కారు కొన్నాక అవసరమయ్యే అన్ని సర్వీసులను ఈ యాప్‌ ఆఫర్‌ చేస్తుంది. అంటే టైర్‌ పంక్చర్, స్టెఫ్నీ చేంజ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ రిపేర్ల వంటి సేవల్ని ఈ యాప్‌ ద్వారా పొందొచ్చు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో రూపొందిన ఈ యాప్‌ సాయంతో వాహన సర్వీసులు ఏ సమయంలోనైనా లభిస్తాయి. ఈ ‘ఫుల్‌ట్యాంక్‌– ఆన్‌డిమాండ్‌ కార్‌ సర్వీస్‌’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  

ప్రత్యేకతలు
సమగ్రమైన మెయింటెనెన్స్‌ సర్వీసులను అందించడం ఈ యాప్‌ ప్రత్యేకత.
రిపేర్‌లో భాగంగా వేసిన విడిభాగాలకు కొంత కాలం గ్యారెంటీ కూడా ఇస్తోంది.
మనకు కారుంది. డ్రైవర్‌ లేడు. మనమేమో నడిపే స్థితిలో లేం. అప్పుడు ఈ యాప్‌ డ్రైవర్‌ను కూడా ప్రొవైడ్‌ చేస్తుంది. దీనికి కొంత మొత్తం చెల్లించాలి. రెగ్యులర్‌ మెయింటెనెన్స్, ఇంటీరియర్‌ అండ్‌ ఎక్స్‌టీరియర్‌ కార్‌ వాష్, టైర్లు/బ్యాటరీల రిప్లేస్‌మెంట్, వీల్‌ అలైన్‌మెంట్‌ వంటి సేవలనూ అందిస్తోంది. గ్యారేజ్‌తోపాటు డోర్‌ పికప్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement