
గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా ముగియడంతో స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా ఓపెన్ అయ్యాయి.
ముంబై : గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ వార్ సమసిపోయేందుకు ఇరు దేశాల మధ్య వాణజ్య చర్చలు అక్టోబర్‌లో జరుగుతాయనే వార్తలు మదుపుదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు నెలకొంది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 36,814 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 10,885 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.