న్యూఢిల్లీ: చారిత్రక ప్రాధాన్యం గల డెస్క్ వెయిట్‌ను ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ వేలంలో మళ్లీ దక్కించుకుంది. తమ జంషెడ్‌పూర్ ప్లాంటులో 1912లో తొలిసారి ఉత్పత్తి చేసిన ఉక్కు రైల్ ట్రాక్ నుంచి దీన్ని తయారు చేశారు. అప్పట్లో బ్రిటన్ నేత రాబర్ట్ క్రెవీ-మిల్నెస్‌కి దీన్ని బహూకరించారు. ఆ తర్వాత ఇది డచెస్ ఆఫ్ రాక్స్‌బర్గ్ కలెక్షన్లో చేరింది. తాజాగా ఈ డెస్క్ వెయిట్‌ను సోత్‌బీ ఆక్షన్ హౌస్ వేలం వేయగా టాటా స్టీల్ దక్కించుకుంది.
అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడించలేదు. దీన్ని జంషెడ్‌పూర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉంచనుంది.
టాటా స్టీల్ చేతికి చారిత్రక డెస్క్ వెయిట్
Published Tue, Jun 2 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM
Advertisement
Advertisement