
పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ లేఖలు!
న్యూఢిల్లీ: న్యాయ పరిధిలో విచారణలో ఉన్న పన్ను వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడంపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కసరత్తు ప్రారంభించింది. జూన్ 1 నుంచీ అమల్లోకి వచ్చిన ‘ప్రత్యక్ష పన్నుల పరిష్కార పథకం 2016’ కింద వివాదాలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలని ‘వివాదాలకు సంబంధించిన’ 2.59 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు లేఖలు రాయనున్నట్లు సమాచారం. నల్లధనం వెల్లడి పథకం విజయవంతానికి జరుగుతున్న ప్రచారం, ప్రయత్నం తరహాలోనే, పన్ను వివాదాల పరస్పర పరిష్కారానికీ ఐటీ శాఖ ప్రయత్నిస్తుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.