టీసీఎస్‌ చేతికి  డబ్ల్యూ12 స్టూడియోస్‌  | TCS acquires London-based W12 Studios | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ చేతికి  డబ్ల్యూ12 స్టూడియోస్‌ 

Published Fri, Nov 2 2018 1:35 AM | Last Updated on Fri, Nov 2 2018 1:35 AM

 TCS acquires London-based W12 Studios - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) లండన్‌ కేంద్రం గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డిజిటల్‌ డిజైన్‌ స్టూడియో, డబ్ల్యూ12 స్డూడియోస్‌ను  కొనుగోలు చేసింది. డిజిటల్, సృజనాత్మక రూపకల్పన సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకునే క్రమంలో భాగంగా ఈ కొనుగోలు చేసినట్లు టీసీఎస్‌ తెలియజేసింది.

అయితే డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఈ కంపెనీ వెల్లడించలేదు. ఇక నుంచి తమ టీసీఎస్‌ ఇంటరాక్టివ్‌ సంస్థలో డబ్ల్యూ12 స్డూడియోస్‌ ఒక విభాగంగా  పనిచేస్తుందని టీసీఎస్‌ పేర్కొంది. ఈ కంపెనీ ప్రస్తుత పేరు, బ్రాండింగ్, కార్యస్థలం అలాగే కొనసాగుతాయని తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement