Tata Consultancy
-
‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మిస్తుండగా తొలి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ వివరాలను ఆలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ ఈ ఏడాది అక్టోబర్‌కల్లా గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుంది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్వయంగా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులపై తాజా సమీక్షా సమావేశంలో నిర్మాణసంస్థలు లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ వారి నిపుణులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారీగా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. గర్భగుడితో ఉన్న ప్రధాన ఆలయంతోపాటు నృత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఇలా ఐదు మండపాలనూ నిర్మిస్తున్నారు. ఐదు మండపాలపై 34 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు ఉండే గుమ్మటాలను ఏర్పాటుచేస్తారు. ఇవి భక్తులకు ఆలయం ప్రాంగణం నుంచి 69 అడుగుల నుంచి 111 అడుగుల ఎత్తుల్లో గోచరిస్తాయి. ప్రధాన ఆలయం పొడవు 380 అడుగులుకాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం గర్భగుడి నిర్మాణంలో మక్రానా మార్బుల్‌తో చెక్కిన స్తంభాలు, పైకప్పు, కుడ్యాలను వినియోగించనున్నారు. ఆలయ బరువు, అన్ని రకాల వాతావరణ మార్పులను తట్టుకునేలా మొత్తంగా 392 భారీ స్తంభాలను ప్రధాన ఆలయం కోసం వాడుతున్నారు. గర్భగుడి ద్వారాలకు బంగారు పూత పూయనున్నారు. ఆలయ ప్రాకారంతో కలిపి రామాలయ విస్తీర్ణం 8.64 ఎకరాలు. ఆలయ ప్రాకారం పొడవు 762 మీటర్లుకాగా లోపలి ప్రాంగణంలో మొత్తం ఆరు ఆలయాలు నిర్మిస్తారు. భక్తుల కోసం విడిగా సదుపాయం కల్పిస్తారు’ అని ఆ ప్రకటన పేర్కొంది. -
టీసీఎస్ చేతికి డబ్ల్యూ12 స్టూడియోస్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లండన్ కేంద్రం గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డిజిటల్ డిజైన్ స్టూడియో, డబ్ల్యూ12 స్డూడియోస్‌ను కొనుగోలు చేసింది. డిజిటల్, సృజనాత్మక రూపకల్పన సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకునే క్రమంలో భాగంగా ఈ కొనుగోలు చేసినట్లు టీసీఎస్ తెలియజేసింది. అయితే డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఈ కంపెనీ వెల్లడించలేదు. ఇక నుంచి తమ టీసీఎస్ ఇంటరాక్టివ్ సంస్థలో డబ్ల్యూ12 స్డూడియోస్ ఒక విభాగంగా పనిచేస్తుందని టీసీఎస్ పేర్కొంది. ఈ కంపెనీ ప్రస్తుత పేరు, బ్రాండింగ్, కార్యస్థలం అలాగే కొనసాగుతాయని తెలిపింది. -
మానేరు రివర్ ఫ్రంట్‌కు సర్వే
కరీంనగర్ కార్పొరేషన్: ఉత్తర తెలంగాణకే మణిహారంగా మధ్య మానేరును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక్కడ మానేరు రివర్ ఫ్రంట్ పనులకు సర్వే చేపడుతున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి టాటా కన్సల్టెన్సీకి చెందిన ఆరుగురు సభ్యుల బృందం మానేరు డ్యాం, నదీ తీరంలో పర్యటించింది. మానేరు డ్యాంలో నీటి లభ్యత, మానేరు వాగు వైశాల్యం, చెక్‌డ్యాం నిర్మాణం, ఐటీ టవర్స్ నిర్మాణానికి స్థలం, సైక్లింగ్‌ట్రాక్, థీమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సర్వే చేపట్టారు. గూగుల్ మ్యాప్‌తో వచ్చిన సదరు బృందం సభ్యులు ప్రతిపాదిత రివర్ ఫ్రంట్‌కు సంబంధించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. మరోమారు 20 మంది సభ్యుల బృందంతో వచ్చే రెండు నెలల్లో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), రివర్ ఫ్రంట్ డిజైన్ తయారు చేసి ఇస్తామని వెల్లడించారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే ప్రభుత్వానికి నివేదించి, అప్రూవల్ తీసుకోవడంతో పాటు టెండర్లు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ... రూ.506 కోట్లతో కరీంనగర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉత్తర తెలంగాణకే మణిహారంగా రివర్ ఫ్రంట్ ఉంటుందని, రెండేళ్లలో పనులుపూర్తి చేసి కరీంనగర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్ పాల్గొన్నారు. -
యాక్సెంచర్‌లో 95వేల కొత్త ఉద్యోగాలు
న్యూయార్క్ : ఈ ఏడాది ఆగస్టుతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా మొత్తం 95,000 నియామకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ సంస్థ యాక్సెంచర్ తెలిపింది. కంపెనీ సెప్టెంబర్-ఆగస్టు కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. మే 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో యాక్సెంచర్ 7.8 బిలియన్ డాలర్ల ఆదాయన్ని ఆర్జించగా, నాలుగో త్రైమాసికంలో 7.45-7.70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఆదాయాలు ఉండొచ్చని అంచనా వేస్తోంది. మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,36,000 పై చిలుకు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు మూడు లక్షల మంది భారత్‌తోనే ఉన్నారు. మరో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీలో అత్యధికంగా 3,19,656 మంది, ఇన్ఫోసిస్‌లో1.76 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.