
55 వేల కంటే ఎక్కువ మందికే ఉద్యోగాలు: టీసీఎస్
బెంగళూరు: టీసీఎస్ కంపెనీ అనుకున్నదానికంటే ఎక్కువ సంఖ్యలోనే కొత్త అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వనున్నది. ఉద్యోగుల పనితీరు ఆధారిత పునర్వ్యస్థీకరణ అంటే ఉద్యోగాల నుంచి ఉద్వాసన చెప్పడం కాదని టీసీఎస్ స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 55 వేల మందికి కొత్త కొలువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ అజోయేంద్ర ముఖర్జీ చెప్పారు. ఈ పనితీరు ఆధారిత పునర్వ్యస్థీకరణ ప్రత్యేక కార్యక్రమమేదీ కాదని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి పనితీరు ఎలా ఉన్నదనే విషయాన్ని మదింపు చేస్తామని వివరించారు. వచ్చే ఏడాది ఎంతమందికి కొలువులిచ్చే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు.