ఉద్యోగులకు ఉత్తమ కంపెనీ టీసీఎస్ | TCS recognized as Global Top Employer | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ఉత్తమ కంపెనీ టీసీఎస్

Published Wed, Mar 2 2016 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

ఉద్యోగులకు ఉత్తమ కంపెనీ టీసీఎస్

ఉద్యోగులకు ఉత్తమ కంపెనీ టీసీఎస్

న్యూఢిల్లీ: ఉద్యోగులకిచ్చే జీతభత్యాలతో పాటు హెచ్‌ఆర్‌కు సంబంధించి 9 అంశాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టీసీఎస్ ఎంపికయింది. 1072 కంపెనీలను వడపోసి టీసీఎస్‌కు ‘గ్లోబల్ టాప్ ఎంప్లాయర్’ అవార్డును అందజేస్తున్నట్లు ఎంప్లాయర్స్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఈ జాబితాలోని  సీజేఎస్‌సీ టెక్‌నిప్, డీహెచ్‌ఎల్, డెమైన్షన్ డేటా, సెయింట్ గోబిన్, జేటీ ఇంటర్‌నేషనల్, మోబినిల్, మోబిస్టర్, ఆరెంజ్, వాలియో వంటి కంపెనీలతో పోటీ పడి టీసీఎస్ ఈ అవార్డును దక్కించుకుంది. కాగా టీసీఎస్ మరింత అభివృద్ధి సాధించడానికి ఇలాంటి అవార్డులు ఎంతగానో ఉపకరిస్తాయని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement