
సాక్షి, ముంబై : టెక్నో మొబైల్ ఇండియా బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనుంది.. జూన్ 17 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు టెక్నో స్పార్క్ పవర్ 2 పేరుతో దీన్ని లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ఒక టీజర్ వీడియోను షేర్ చేసింది. టెక్నో స్పార్క్ 2 ధర రూ. భారతదేశంలో ఉంచింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది. 10 నిమిషాల ఛార్జింగ్ తో 3 గంటల బ్యాటరీ, . బిగ్గెస్ట్ స్క్రీన్, బెస్ట్ బ్యాటరీ, స్మార్ట్ ఫోన్ అనే హ్యాష్‌ట్యాగ్ ను జోడించింది
6000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ క్వాడ్ రియర్ కెమెరా, స్టీరియో సౌండ్ స్పీకర్లు, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయని భావిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో భారతదేశంలో లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ పవర్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్ ను తీసుకొస్తోంది. టెక్నో స్పార్క్ పవర్ 2 ఇతర స్పెసిఫికేషన్స్ ఇతర ఆఫర్ వివరాలు లాంచింగ్ రోజు రివీల్ కానున్నాయి.
Are you ready to play big? Get ready to binge watch with an amazing theater-like experience. Spark Power 2 is launching on Flipkart on 17th of June. Stay Tuned to know more. #SparkPower2 #BestBatterySmartphone #TecnoSpark #Flipkart #BiggestScreen pic.twitter.com/bXsL05ZcwH
— TecnoMobileInd (@TecnoMobileInd) June 15, 2020
Comments
Please login to add a commentAdd a comment