న్యూఢిల్లీ: గత బడ్జెట్లో సుంకాల్ని హేతుబద్ధీకరించడంతో దేశంలో కొత్త మొబైల్ తయారీ యూనిట్లు భారీగా ఏర్పడుతున్నాయని టెలికం మంత్రి రవి శంకర ప్రసాద్ చెప్పారు. 2015-16లో దేశంలో కొత్తగా 11 మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పడ్డాయని, దీంతో ఉత్పత్తి రెట్టింపు కానున్నదని తెలియజేశారు.