
అనిశ్చితిలోనే పసిడి ధర
న్యూయార్క్/ముంబై: పసిడి ధరకు సంబంధించి రానున్న ఒకటి రెండు వారాల్లో అనిశ్చితి కొనసాగుతుందని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్‌లలో ఒడిదుడుకులు పసిడిపై కూడా ప్రభావం చూపుతున్నాయని వారి అభిప్రాయం. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
న్యూ యార్క్ కమోడిటీ మార్కెట్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర వారం వారీగా శుక్రవారం కేవలం రెండు డాలర్లు ఎగసి 1,224 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా కూడా అంతర్జాతీయ మందగమన ధోరణే కొనసాగుతోంది. శుక్రవారంతో ముగి సిన వారంలో ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండవ వారమూ పసిడి నష్టపోయింది. 99.9 స్వచ్ఛత 10 గ్రాముల పసిడి ధర స్వల్పంగా రూ.15 తగ్గి, రూ.28,495 వద్ద ముగిసింది.