స్వర్ణ స్ఫటికం | the world's largest gold crystal | Sakshi
Sakshi News home page

స్వర్ణ స్ఫటికం

Published Sun, Apr 13 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

స్వర్ణ స్ఫటికం

స్వర్ణ స్ఫటికం

న్యూయార్క్: కొన్నేళ్ల క్రితం వెనిజువెలాలో కనుగొన్న బంగారపు తునకను ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి స్ఫటికం(గోల్డ్ క్రిస్టల్)గా గుర్తించారు. దీని బరువు 217.78 గ్రాములు. విలువ 15 లక్షల డాలర్లు (మన కరెన్సీలో 9 కోట్ల రూపాయలపైనే). ఇంత పరిమాణం కలిగిన కూడిన గోల్డ్ క్రిస్టల్‌ను అధ్యయనం చేయడం ఇదే ప్రథమమని మియామీ యూనివర్సిటీ జియాలజిస్ట్ జాన్ రాకోవాన్ అన్నారు.

వెనిజు లాలోని ఓ నదిలో నాలుగు దశాబ్దాల క్రితం ఇలాంటి నాలుగు క్రిస్టల్స్ దొరికాయి. అమెరికాలో నివసించే వీటి యజమాని ఒక క్రిస్టల్‌ను పరిశోధన నిమిత్తం మియామీ యూనివర్సిటీకి ఇచ్చాడు. దీన్ని గోల్డ్ క్రిస్టల్‌గా యూనివర్సిటీ ధ్రువీకరిస్తే, సహజసిద్ధంగా ఏర్పడిన ఈ స్ఫటికం విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement