న్యూఢిల్లీ: దేశంలో సేవలందిస్తున్న బహుళజాతి ఆడిటింగ్ సంస్థల నియంత్రణల విధానాలను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. సదరు అకౌంటింగ్ సంస్థల నియంత్రణ యంత్రాంగాన్ని పునఃసమీక్షించే విధానం లేకపోతే చార్టర్ట్ అకౌంటెన్సీ వృత్తిపై గణనీయమైన ప్రబావం పడుతుందని, అనియంత్రిత ఆడిటింగ్ సంస్థలతో ఆర్థికరంగం, దేశంపైనే తీవ్రమైన ప్రభావం పడుతుందని జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యు.యు.లలిత్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఎఫ్‌డీఐ, ఫెమా నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) అనే ఎన్‌జీవోతోపాటు మరో సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి సూచనలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment