గణనీయంగా పెరిగిన ఈ-ఫైలింగ్ రిటర్న్‌లు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖకు ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై సెప్టెంబర్ 7 నాటికి 2.06 కోట్ల రిటర్న్స్ అందాయి. వ్యక్తుల ఈ-రిటర్న్స్ ఫైలింగ్‌కు ఈ నెల 7వ తేదీ తుది గడువు. కాగా గత ఏడాది ఈ-ఫైలింగ్ రిటర్న్స్ సంఖ్య 1.63 కోట్లు. పెరుగుదల రేటు 26.12%. ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో ఈ అంశాలను తెలిపింది. 2015-16 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) సెప్టెంబర్ 7వ తేదీ నాటికి 45.18 లక్షల రిటర్న్స్ ప్రాసెస్ చేసి, 22.14 లక్షల మందికి రిఫండ్స్ జారీ చేసింది. ఐటీ శాఖ తన పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలో దాదాపు 32.95 లక్షల ఈ-రిటర్న్స్‌ను పరిశీలించింది.