గత మూడు రోజలుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పసిడి ధరలు నేడు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం ఉదయం 10:10 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.503 పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ.46,551 వద్ద ట్రేడ్ అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ నిన్నటితో పోలిస్తే 20 డాలర్లు పెరిగి ఔన్స్ బంగారం 1,713.40 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇప్పటికీ అంతర్జాతీయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా భావిస్తునందున పసిడి ధర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సంక్షోభం, హాంగ్‌కాంగ్ భద్రతా చట్టం వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీంతో నేడు 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment