శుక్రవారం పసిడి ధర దాదాపు స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఉదయం 10:20 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే కేవలం రూ.4 రూపాయలు మాత్రమే పెరిగి 10 గ్రాముల పసిడి రూ.46,555 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే 6 డాలర్లు పెరిగి ఔన్స్ బంగారం 1,719.10 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతుండడం వల్లే పుత్తడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment