
బర్డ్ ఇన్ఫర్మేషన్‌తో ట్రూజెట్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏవియేషన్, పర్యాటకరంగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ సేవలను అందించే బర్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌తో ట్రూజెట్ చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా ట్రూజెట్‌కు ఉన్న అన్ని ఎయిర్‌పోర్టు ఆఫీసులు, కాల్ సెంటర్స్, ఇంటర్నెట్ బుకింగ్ ఇంజన్లకు బర్డ్ ఇన్ఫర్మేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో చాలా సులభంగా ఆన్‌లైన్ ద్వారా టికెట్ బుకింగ్ సేవలు పొందవచ్చని టర్బో మెఘా ఎయిర్‌వేస్ డెరైక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. జూలై 10 నుంచి ట్రూజెట్ టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.