‘హైదరాబాద్‌-మైసూరు’ కొత్త ట్రూ జెట్‌ | Trujet launches Hyderabad-Mysore services under regional connectivity scheme | Sakshi
Sakshi News home page

‘హైదరాబాద్‌-మైసూరు’ కొత్త ట్రూ జెట్‌

Published Sat, Sep 2 2017 5:38 PM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

Trujet launches Hyderabad-Mysore services under regional connectivity scheme

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మెగా వారసుడు , హీరో రామ్ చరణ్  టర్బో మెగా ఎయిర్వేస్ తో కలిసి సంయుక్తంగా  కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ట్రూ జెట్’  ఎయిర్‌లైన్స్‌   కొత్త విమాన సర్వీసును ప్రారంభించింది. ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద హైదరాబాద్-మైసూర్ సర్వీసులను ప్రారంభించింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉడాన్‌ పథకంలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌- నాందేడ్‌ , హైదరాబాద్-కడప సర్వీసులను ప్రకటించిన ట్రూ జెట్‌ తాజాగా మైసూరును ఈ జాబితాలో చేర్చింది. మెట్రో నగరాలతో  ఇతర  సిటీలను అనుసంధానించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ - మైసూర్‌ ఎయిర్ కనెక్టివిటీ సర్వీసును  ప్రారంభించినట్టు టర్బో- మేఘా ఎయిర్వేస్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి ఉమేష్ చెప్పారు. ఇది మొత్తం ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని తాము ఆశిస్తున్నామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement