![ట్రూజెట్ ప్రత్యేక డిస్కౌంట్](/styles/webp/s3/article_images/2017/09/3/81447956610_625x300.jpg.webp?itok=XzeTFMj7)
ట్రూజెట్ ప్రత్యేక డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థానిక విమానయాన సంస్థ ట్రూ జెట్ ఎంపిక చేసిన వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ట్రూ జెట్‌లో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, మీడియా సంస్థల ప్రతినిధులు, దక్షిణ భారత ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు, మూవీ ఆర్టిస్ట్స్‌అసోసియేషన్ సభ్యులకు 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ట్రూ జెట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. టాలీవుడ్ నటుడు రాంచరణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ట్రూ జెట్ 4 నెలల క్రితం విమాన సర్వీసులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నాలుగు నెలల నుంచి సర్వీసులను విజయవంతంగా నడుపుతున్నామని, ఆ ప్రత్యేక ఆఫర్లతో మరింత మంది ప్రయాణీకులను ఆకర్షించగలమన్న ధీమాను టర్బో మెఘా ఎయిర్‌వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ వ్యక్తం చేశారు.