పెరిగేవి ఇవే..
- శీతల పానీయాలు, మినరల్ వాటర్‌పై పన్నును 18 నుంచి 21 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.
- పారిశ్రామికంగా వినియోగించే సోలార్ వాటర్ హీటర్లపై పన్నును 7.5 నుంచి 10 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.
- ఇళ్లు మారినప్పుడు వినియోగించుకునే ‘ప్యాకర్స్ అండ్ మూవర్స్’ సేవలపై పన్నును 4.2 శాతం నుంచి 5.6 శాతానికి పెంచనున్నారు. లాటరీ టికెట్లను కూడా సేవాపన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. అద్దె వాహనాలను కూడా సేవా పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ సేవలపై 5.6 శాతం పన్ను వసూలు చేయాలని ప్రతిపాదించారు.
- విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సర్క్యూట్ బోర్డులపై పన్నును 1 శాతం పెంచారు. దీంతో దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్ల ధరలు ఒక శాతం వరకు పెరిగే అవకాశముంది
- ఇమిటేషన్ ఆభరణాలపై పన్నును ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 15 శాతానికి పెంచనున్నారు.