రవీంద్రనాథ్‌కు నిర్యత్‌శ్రీ అవార్డు | Vanka Ravindranath got Niryat Shree award | Sakshi
Sakshi News home page

రవీంద్రనాథ్‌కు నిర్యత్‌శ్రీ అవార్డు

Published Tue, Dec 2 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

రవీంద్రనాథ్‌కు నిర్యత్‌శ్రీ అవార్డు

రవీంద్రనాథ్‌కు నిర్యత్‌శ్రీ అవార్డు

సాక్షి, న్యూఢిల్లీ: భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఈఓ) ప్రకటించిన నిర్యత్‌శ్రీ అవార్డును పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వంకా రవీంద్రనాథ్ అందుకున్నారు. సోమవారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. వివిధ రంగాల్లో ఎగుమతుల విషయంలో విశేష ప్రతిభ కనబరిచిన వ్యాపారవేత్తలకు ఈ అవార్డును ప్రకటిస్తారు. ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్ అయిన వంకా రవీంద్రనాథ్ తలనీలాల ఎగుమతుల్లో విశేష ప్రతిభ కనబరిచారు. మహిళలకు ఉపాధి కల్పించడం, విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టడంలో గుర్తించదగిన ప్రతిభ, వృద్ధి చూపినందుకు ఆయనను ఈ అవార్డు వరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement