లండన్ : బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి, యూకేలో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా పాడిన పాటే మళ్లీ పాడుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టులో తాను సాక్ష్యాలతో నిరూపించుకుంటానంటూ చెప్పుకొచ్చారు. భారత్‌లో తనకు ప్రమాదముందంటూ ఆరోపించారు. విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై నేడు ముందస్తు విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా విజయ్‌మాల్యా లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టుకు హాజరయ్యారు.
బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి వెళ్లి, యూకేలో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యాను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా స్కాట్‌ల్యాండ్ యార్డ్ పోలీసులు ఈ ఏడాది ప్రారంభంలో ఆయన్ను అరెస్ట్‌చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. మాల్యా అప్పగింత కేసు విచారణ డిసెంబర్ 4న ప్రారంభం కానుంది. 4 నుంచి 5, 6, 7, 11, 12, 13, 14 తేదీల్లో మాల్యా కేసుకు సంబంధించి విచారణ జరుగనుంది. మాల్యాకు వ్యతిరేకంగా భారత్ అధికారుల తరుఫున యూకే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు వాదనలు వినిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment