extradition hearing
-
నీరవ్‌కు లండన్ హైకోర్టులో చుక్కెదురు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ.13,500 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్‌లోని హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ నీరవ్ లండన్‌లోని హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతించాలంటూ సంబంధిత పత్రాలను సమర్పించారు. ఈ పత్రాలను పరిశీలించిన కోర్టు మంగళవారం తిరస్కరించింది. అయితే, మరో ఐదు రోజుల్లోపు నీరవ్ హైకోర్టులో మరోసారి అప్పీల్‌చేసుకునే అవకాశముంది. భారత్‌లో ఆర్థికనేరాల్లో నిందితుడైన కారణంగా నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలంటూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలిచ్చింది. నీరవ్ భారత్‌లో మనీ ల్యాండరింగ్, నమ్మకద్రోహం తదితర నేరాభియోగాలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్.. నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు సమ్మతి తెలుపుతూ ఏప్రిల్ 15న ఆదేశాలు జారీచేశారు. హోం మంత్రి నిర్ణయాన్ని, వెస్ట్‌మినిస్టర్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అవకాశమివ్వాలంటూ నీరవ్ హైకోర్టులో దాఖలుచేసిన ‘అప్పీల్’ అనుమతి పత్రాలను కోర్టు మంగళవారం తిరస్కరించిందని హైకోర్టు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 50ఏళ్ల నీరవ్‌ను 2019 మార్చి 19న అరెస్ట్‌చేసిన యూకే పోలీసులు అతడిని నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంచారు. -
భారత్‌కు మాల్యా : బిగ్ బ్రేక్
లండన్: భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా (63) ను స్వదేశం రప్పించే ప్రయత్నంలో మరో బ్రేక్ పడింది. మాల్యాను భారత్ అప్పగించే ఉత్తర్వుకు వ్యతిరేకంగా యుకె హైకోర్టులో మాల్యా పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. 2020 ఫిబ్రవరి 11వ తేదీకి ఈ విచారణను వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 11 నుండి మూడు రోజులపాటు ఈ అంశంపై విచారణ చేపట్టనున్నామని లండన్ హైకోర్టు అధికారి ఒకరు తెలిపారు. కాగా సుమారు రూ. 9వేల కోట్లకు పైగా బ్యాంకులకు బకాయి పడిన కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాపై మనీలాండర్‌రింగ్ ఆరోపణలతో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. ఆర్థిక నేరగాడు మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి2, 2016న దేశంనుంచి పారిపోయిన మాల్యాను ఎట్టకేలకు 2017లో లండన్ పోలీసుల సాయంతో మాల్యాను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మాల్యా బెయిల్‌పై ఉన్నాడు. అయితే బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు 100శాతం చెల్లించడానికి సిద్దంగా ఉన్నా బ్యాంకులు మాత్రం ఆ డబ్బు తీసుకోవడంలేదని మాల్యా వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
మాల్యా కేసు : ముంబై జైలు ఓకేనా? కాదా?
లండన్ : బ్యాంక్‌లకు వేలకోట్లు కొల్లగట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, భారత్‌కు అప్పగింత కేసు నేడు విచారణకు వచ్చింది. ఈ విచారణలో భాగంగా విజయ్ మాల్యా మధ్యాహ్నం వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా విజయ్ మాల్యాను ఉంచేందుకు భారత అథారిటీలు సమర్పించిన ముంబై జైలు సెల్ వీడియోను జడ్జి సమీక్షించారు. విజయ్ మాల్యాను ఉంచే ముంబై ఆర్థూర్ రోడ్డు జైలు బ్యారెక్ 12కు సంబంధించి ప్రతీది స్టెప్-బై-స్టెప్ వీడియో తీసి తమకు సమర్పించాలని గత విచారణ సందర్భంగా జూలైలో వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు జడ్జి ఎమ్మా అర్బుత్నోట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోతో అన్ని అనుమానాలను నివృతి చేయాలని పేర్కొంది. భారత్‌లో జైళ్లు దారుణంగా ఉన్నాయంటూ విజయ్ మాల్యా ఆరోపించారు. సరైన సదుపాయాలు ఉండవని, గాలి, వెలుతురు సైతం సరిగ్గా ఉండవని విజయ్ మాల్యా పేర్కొన్నారు. దీంతో మాల్యాను ఉంచే జైలుకు సంబంధించిన 10 నిమిషాల నిడివి గల వీడియోను తీసి భారత అధికారులు లండన్ కోర్టుకు సమర్పించారు. బ్యారెక్-12లో మాల్యా కోసం ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేశామని, ఆ సెల్లో మాల్యా కోసం ప్రత్యేకంగా ఎల్సీడీ టీవీ, కొత్త పరుపులు, తల్లగడ్లు, దుప్పట్లు, వాష్ ఏరియా, వెస్ట్రన్ స్టయిల్లో టాయిలెట్, లైబ్రరీ, మంచి వెలుతురు వచ్చేలా తూర్పు వైపు గది కల్పిస్తామని చెప్పారు. ఈ వీడియోను నేడు లండన్ కోర్టు పరిశీలిస్తోంది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు, భారత ప్రభుత్వం తరుఫున వాదిస్తున్నారు. అప్పగింత ప్రొసీడింగ్స్‌కు సంబంధించి యూకే మానవ హక్కుల బాధ్యతల్లో భాగంగా సెల్‌ను తనిఖీ చేయాలని విజయ్ మాల్యా డిఫెన్స్ టీమ్ వాదిస్తోంది. విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన విజయ్ మాల్యాను మీడియా పలు ప్రశ్నలు వేసింది. ‘ముందు నుంచి నేను చెబుతున్న మాదిరి, కర్నాటక హైకోర్టు ముందు నేను సమగ్ర పరిష్కార ఆఫర్‌ను ఉంచాను. గౌరవనీయులైన జడ్జీలను దీనిపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని మాల్యా అన్నారు. కాగా, దేశీయ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా, ఆ రుణాలను కట్టలేక చేతులెత్తేసి, చెప్పాపెట్టకుండా విదేశాలకు పారిపోయారు. -
మాల్యా అప్పగింత : నేడే కీలక పరిణామం
భారత బ్యాంక్‌లకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అతన్ని భారత్‌కు అప్పగించే కేసులో యూకే కోర్టులో జరుగుతున్న విచారణలో నేడే తుది ఘట్టం. మంగళవారం జరుగబోయే ఫైనల్ విచారణలో ఈ కేసు ముగింపు అంకానికి రాబోతుందని తెలుస్తోంది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ వద్ద చీఫ్ మెజిస్ట్రేట్ ముందు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ రెండూ కూడా తమ తమ తుది వాదనలను వినిపించబోతున్నాయి. భారత్ తరఫున ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(సీపీఎస్) ఈ కేసును వాదిస్తోంది. ఈ కేసుపై తుది తీర్పును యూకే కోర్టు సెప్టెంబర్‌లో వెల్లడించనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ కేసు తుది విచారణ ప్రారంభం కానుందని తెలిసింది. గత డిసెంబర్లోనే మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు తుది విచారణ చేపట్టాలని యూకే కోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు తుది విచారణలో కాస్త జాప్యం జరిగింది. ఈ కేసులో ఎక్కువగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఐడీబీఐ బ్యాంక్‌కు ఎగ్గొట్టిన రుణాలపై వాదన జరుగుతోంది. మొత్తం అన్ని భారత బ్యాంక్‌లకు కలిపి రూ.9900 కోట్ల రుణాలను మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాకీ పడింది. ఈ రుణాలన్నింటిన్నీ ఎగ్గొట్టి మాల్యా విదేశాలకు పారిపోయారు. మాల్యా 2016 మార్చి నుంచి బ్రిటన్‌లో లగ్జరీ జీవితం గడుపుతున్నారు. అతనిని తమకు అప్పగించాలంటూ భారత్ చేసుకున్న అభ్యర్థనపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేశారు కూడా. ఆ అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై విచారణ ప్రారంభమైంది. మరోవైపు మాల్యా భారత్‌కు వచ్చేందుకు సముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాల్యాపై పరారీ ఆర్థిక నేరగాడుగా ముద్ర వేయడంతోపాటు అతనికి చెందిన రూ.12,500 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనపర్చుకునేందుకు అనుమతివ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ముంబైలోని ప్రత్యేక కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ కోసం వచ్చేనెల 27న ప్రత్యక్షంగా హాజరుకావాలని మాల్యాకు కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకాకుంటే కోర్టు మాల్యాను పరారీ ఆర్థిక నేరగాడుగా ప్రకటించడంతోపాటు ఆయన ఆస్తుల స్వాధీనానికి అనుమతిచ్చే అవకాశం ఉంది. అదే గనక జరిగితే మాల్యాకు దేశ, విదేశాల్లో ఉన్న ఆస్తులను దర్యాప్తు ఏజెన్సీ తక్షణమే స్వాధీనం చేసుకోనుంది. దాంతో దిగొచ్చిన మాల్యా.. విచారణకు ప్రత్యక్షంగా హాజరై తన గోడు వెళ్లబోసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. -
అప్పగింతకు జడ్జి అంగీకరిస్తే...
బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి, యూకేలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగింత కేసు విచారణ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. వచ్చే 10 రోజుల వరకు వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు చీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నోట్ ఈ కేసుపై వాదనలు విననున్నారు. భారత ప్రభుత్వం తరుఫున 'బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్' తన వాదనలను వినిపించనుంది. అదేవిధంగా మాల్యా తరుఫున క్లేర్ మాంట్ గోమెరీ వాదించనున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలు, నేరస్తుల అప్పగింత వంటి కేసుల్లో క్లేర్‌కు ఏళ్ల అనుభవం ఉంది.ఈ కేసు వాదనలు ముగిసే సమయానికి అప్పగింతకు జడ్జి అంగీకరిస్తే, యూకే హోమ్ సెక్రటరీ అంబర్ రూడ్, మాల్యాను రెండు నెలల వ్యవధిలో భారత్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీచేయనున్నారు. ఈ విచారణలో టాప్ సీబీఐ అధికారులు, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా పాల్గొననున్నారు. స్కాట్లాండ్ యార్డు పోలీసులు గతంలో ఆయనను లండన్‌లో అరెస్టు చేయగా, 650,000 పౌండ్ల పూచీకత్తుపై బెయిల్ పొంది బయటికి వచ్చారు. మాల్యా గత ఏడాది మార్చి నెలలో భారత్ నుంచి ఇంగ్లాండుకు పారిపోయిన సంగతి తెలిసిందే. యూకేకు పారిపోయిన మాల్యా అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. -
వాద్రాలా రాజకీయ బాధితుడ్ని: మాల్యా
లండన్: తాను సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, హిమాచల్ సీఎం వీరభద్రసింగ్‌ల మాదిరి రాజకీయ బాధితుడినని లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా అన్నారు. బ్యాంకులకు వేల కోట్ల రుణాల ఎగవేతకేసులో విచారణ ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న మాల్యా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా వాద్రా, వీరభద్రసింగ్లను టార్గెట్ చేసిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మాల్యా ప్రస్తావించారు. భారత్‌లో జైళ్ల పరిస్థితి అమానవీయంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు. బ్లూసూట్, టైతో కోర్టు హాల్లోకి వచ్చిన మాల్యా ప్రశాంతంగా కనిపించారు. తనకు ఎదురుపడిన మీడియా ప్రతినిధులతో కోర్టులోపలకి వచ్చి విచారణను గమనించండి అని కోరారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని తోసిపుచ్చారు.మరోవైపు మాల్యా ప్రకటనను ఈడీ తోసిపుచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలను దీటుగా ఎదుర్కోలేక కేసును తప్పుదారిపట్టించేలా దృష్టి మరల్చేందుకు మాల్యా ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. రుణాల ఎగవేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాల్యా మార్చి 2016లో భారత్ నుంచి అదృశ్యమై బ్రిటన్‌లో తలదాచుకున్నారు. మాల్యా అప్పగింత కేసుపై విచారణ జరుగుతున్న క్రమంలో భారత్‌లో జైళ్ల పరిస్థితి దయనీయంగా ఉంటుందనే వాదనను తెరపైకి తీసుకువచ్చారు. మాల్యాపై నమోదైన కేసు వివరాలు, పూర్తి ఆధారాలను సీబీఐ, ఈడీలు కోర్టుకు సమర్పించాయి. -
మాల్యా మళ్లీ పాడిందే పాట
లండన్ : బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి, యూకేలో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా పాడిన పాటే మళ్లీ పాడుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టులో తాను సాక్ష్యాలతో నిరూపించుకుంటానంటూ చెప్పుకొచ్చారు. భారత్‌లో తనకు ప్రమాదముందంటూ ఆరోపించారు. విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై నేడు ముందస్తు విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా విజయ్‌మాల్యా లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టుకు హాజరయ్యారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి వెళ్లి, యూకేలో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యాను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా స్కాట్‌ల్యాండ్ యార్డ్ పోలీసులు ఈ ఏడాది ప్రారంభంలో ఆయన్ను అరెస్ట్‌చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. మాల్యా అప్పగింత కేసు విచారణ డిసెంబర్ 4న ప్రారంభం కానుంది. 4 నుంచి 5, 6, 7, 11, 12, 13, 14 తేదీల్లో మాల్యా కేసుకు సంబంధించి విచారణ జరుగనుంది. మాల్యాకు వ్యతిరేకంగా భారత్ అధికారుల తరుఫున యూకే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు వాదనలు వినిపించనుంది. -
మాల్యాపై విచారణ వాయిదాపడింది
లండన్ : భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగనామం పెట్టి యూకేలో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే విషయమై లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు రాబోతున్నకేసు విచారణ వాయిదా పడింది. విజయ్ మాల్యా అప్పగింత విచారణ జూన్ 13కు వాయిదా పడినట్టు బ్రిటన్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) శనివారం పేర్కొంది. భారత అధికారుల తరుఫున వెస్ట్ మినిస్టర్ కోర్టులో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు తమ వాదనలు వినిపించనుంది. మాల్యాను భారత్ కు అప్పగించే కేసు విచారణను మే17న చేపట్టనున్నట్టు అంతకముందు లండన్ కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణ జూన్ 13కు వాయిదా పడినట్టు సీపీఎస్ అధికార ప్రతినిధి చెప్పారు. మాల్యాను భారత్ కు అప్పగించే ప్రయత్నాల్లో భాగంగా గతనెలే ఆయన్ను స్కాట్లాండ్ పోలీసులు అక్కడ అరెస్టు చేశారు. అరెస్టు అయిన గంటల వ్యవధిలోనే ఆయన బెయిల్ పై బయటికి వచ్చారు. మాల్యా అరెస్టు తర్వాత ఆయన్ను వీలైనంత త్వరగా భారత్ కు రప్పించాలని ఇక్కడి అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నలుగురు సభ్యుల సీబీఐ, ఈడీ టీమ్ కూడా గత నెలే లండన్ కు వెళ్లింది. ఈడీ, సీబీఐ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా సీపీఎస్ అక్కడి కోర్టులో తమ వాదనలు వినిపించనుందని అధికార వర్గాలు చెప్పాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత అయిన మాల్యా, భారత బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల ఎగ్గొట్టి, యూకేకు పారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సీబీఐ, ఈడీ అధికారులు ఆయన్ను భారత్ కు రప్పించడానికి, బ్యాంకులు తమ రుణాలు రికవరీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.