కొత్త సీఈవో, ఎండీగా క్యాప్‌జెమినీ సీవోవోగా పనిచేసిన థియర్రీ డెలాపోర్ట్‌ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించడంతో విప్రో కౌంటర్‌కు హుషారొచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7 శాతం జంప్‌చేసింది. రూ. 214 సమీపంలో ట్రేడవుతోంది. అయితే ఐటీ సేవల రంగంలోని ఇతర దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ 1.2 శాతం చొప్పున డీలాపడి ట్రేడవుతుండటం గమనార్హం. కాగా.. క్యాప్‌జెమిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా ఇటీవల వరకూ బాధ్యతలు నిర్వహించిన డెలాపోర్ట్ జూన్ 1 నుంచి కొత్త సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు విప్రో తాజాగా పేర్కొంది. ఇప్పటివరకూ విప్రో సీఈవోగా కొనసాగుతున్న అబిదాలీ నీముచ్‌వాల ఈ నెల31కల్లా బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. విప్రోలో నాలుగేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నీముచ్‌వాల వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment