
మరిన్ని భద్రతా ప్రమాణాలతో రూ.500, 1,000 నోట్లు
ముంబై: మరిన్ని భద్రతా ప్రమాణాలతో కొత్తగా రూ.500, 1,000 కరెన్సీ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. నకిలీ నోట్లను తేలిగ్గా గుర్తించేట్లు రెండు అదనపు ఫీచర్లు తాజా నోట్లలో చేర్చుతున్నట్లు వివరించింది. కాగా ప్రస్తుతం నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని సైతం ఆర్‌బీఐ ప్రకటన స్పష్టం చేసింది.