షావోమి టాప్‌ స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు | Xiaomi announces price cut for one of its top selling smartphone  | Sakshi
Sakshi News home page

షావోమి టాప్‌ స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు

Published Mon, Jun 3 2019 8:43 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Xiaomi announces price cut for one of its top selling smartphone  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌   రెడ్‌మి నోట్‌ 6 ప్రొ ధరను శాశ్వతంగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 6జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌  వేరియంట్‌ రెడ్‌మి నోట్‌ 6ప్రొ ధరపై రూ. 2 వేలు  కోత పెట్టింది. ఈ తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ప్రస్తుతం రూ. 13,999కు దిగి వచ్చింది.  ఫ్లిప్‌కార్ట్‌,  ఎంఐడాట్‌ కామ్‌తోపాటు, ఎంఐ స్టోర్లలో  ఈ తగ్గింపు ధరలో లభిస్తుంది.  

దీంతోపాటు  రిలయన్స్‌ జియో ద్వారా 2400 రూపాయల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఉంది. 6టీబీ డేటా ఆఫర్‌ ఉంది.  అలాగే ఎక్స్జేంజ్‌ ఆఫర్‌, నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. కాగా గత ఏడాది నవంబరులో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌  చేసింది.  అలాగే రెడ్‌మి నోట్‌ 6 ప్రొ  4జీబీ వేరియంట్‌పై ఇప్పటికే శాశ్వత తగ్గింపును అందించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement