చైనాకు చెందిన షావోమి, ఎంఐ యాక్ససరీస్‌పై భారత్‌లో ధరలు తగ్గించింది. జీఎస్టీ తగ్గింపుతో, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నట్టు పేర్కొంది. తాజా ఈ నిర్ణయంతో ఎంఐ పవర్ బ్యాంకు, ఎంఐ బిజినెస్ బ్యాక్‌ప్యాక్, ఎంఐ ఛార్జర్, 2-ఇన్-1 యూఎస్‌బీ ఫ్యాన్, పలు స్మార్ట్‌ఫోన్ కేసులు ప్రస్తుతం సమీక్షించిన ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ చైనీస్ కంపెనీ దేశంలో మూడో తయారీ సౌకర్యాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ఈ ప్రకటనను వెలువరించింది. ''జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ రేటును తగ్గించింది. ఈ ప్రయోజనాలను మా ప్రియమైన ఎంఐ అభిమానులకు అందించే సమయం ఆసన్నమైంది. మీరు కోరుకున్న ధరలో మీకు ఇష్టమైన యాక్ససరీని కొనుగోలు చేయవచ్చు'' అని షావోమి తన ఎంఐ కమ్యూనిటీ ఫోరమ్స్ ఒక పోస్టు చేసింది.
సమీక్షించిన ధరల అనంతరం 10000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2 రూ.1,099కే అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర 1,199 రూపాయలు. 10000ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ ప్రొ రూ.1,499కు(అసలు ధర రూ.1,599), 20,000ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 2 రూ.1,999కు(అంతకముందు దర రూ.2,199) తగ్గించినట్టు షావోమి తెలిపింది. రూ.1,499గా ఉన్న ఎంఐ బిజినెస్ బ్యాక్‌ప్యాక్ ధర రూ.1,299కు తగ్గింది. ఇలా ఎంఐ ఛార్జర్, పలు స్మార్ట్‌ఫోన్ కేసులపై కూడా ధరలను తగ్గించింది. అన్ని యాక్ససరీస్, కేసులు, స్క్రీన్ ప్రొటెక్టర్స్ కొత్త ధరలతో ఎంఐ ఇండియా స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని షావోమి తెలిపింది. అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్ కూడా ఎంఐ యాక్ససరీస్ ధరలను అప్‌డేట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment