భారీ ఆఫర్‌ : ఏడు వేలకు మోటో ఎక్స్‌ 4 | You Can Now Buy The Moto X4 For Just Rs 6999 | Sakshi
Sakshi News home page

భారీ ఆఫర్‌ : ఏడు వేలకు మోటో ఎక్స్‌ 4

Published Fri, Jun 22 2018 6:02 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

You Can Now Buy The Moto X4 For Just Rs 6999 - Sakshi

మోటో ఎక్స్‌ 4 స్మార్ట్‌ఫోన్‌

స్టన్నింగ్‌ ఫీచర్లతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ను బ్లర్‌ చేసుకునే అద్భుతమైన సదుపాయంతో వచ్చిన మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్‌ మోటో ఎక్స్‌4. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 22,999 రూపాయలు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఏడు వేల రూపాయలకే ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న సూపర్‌ వాల్యు వీక్‌లో మోటో ఎక్స్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ/64జీబీ వేరియంట్‌ కేవలం ఏడు వేల రూపాయలకే అందిస్తోంది. అది ఎలా అంటే... ‘బైబ్యాక్‌ ఆఫర్స్‌’ కింద ఈ ప్రొడక్ట్‌ను కొంటే, రూ.16వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ ధర రూ.6999కు దిగొస్తోంది. అదేవిధంగా నియమ, నిబంధనలు అమల్లో ఉంటాయి. ఒకవేళ ఎక్స్చేంజ్‌లో ఈ ఫోన్‌పై కొంటే, రూ.12,200 ఫ్లాట్‌ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. 

మోటో ఎక్స్‌ 4 ఫీచర్లు..
గ్లాస్‌ బాడీ
2.2గిగాహెడ్జ్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 ప్రాసెసర్‌
12 ఎంపీ, 8 ఎంపీ సెన్సార్లతో రియర్‌ కెమెరా
16 ఎంపీ సెన్సార్‌తో ఫ్రంట్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
టైప్‌-సీ ఛార్జర్‌
ఈ సూపర్‌ వాల్యు వీక్‌లోనే మిగతా స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. బైబ్యాక్‌ ఆఫర్‌ కింద షావోమి రెడ్‌మి నోట్‌ 4 రూ.5500కు కొనుగోలు చేసుకోవచ్చు. 70 వేల రూపాయల గూగుల్‌ పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ కూడా రూ.10,999కే అందుబాటులో ఉంచింది. ఐఫోన్‌ 6, ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 8 ప్లస్‌, మోటో ఎక్స్‌4 వంటి పాపులర్‌ మొబైల్‌ ఫోన్లు కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement