Moto X4
-
భారీ ఆఫర్ : ఏడు వేలకు మోటో ఎక్స్ 4
స్టన్నింగ్ ఫీచర్లతో పాటు బ్యాక్ గ్రౌండ్‌ను బ్లర్ చేసుకునే అద్భుతమైన సదుపాయంతో వచ్చిన మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్4. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 22,999 రూపాయలు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఏడు వేల రూపాయలకే ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న సూపర్ వాల్యు వీక్‌లో మోటో ఎక్స్ 4 స్మార్ట్‌ఫోన్ 4జీబీ/64జీబీ వేరియంట్ కేవలం ఏడు వేల రూపాయలకే అందిస్తోంది. అది ఎలా అంటే... ‘బైబ్యాక్ ఆఫర్స్’ కింద ఈ ప్రొడక్ట్‌ను కొంటే, రూ.16వేల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.6999కు దిగొస్తోంది. అదేవిధంగా నియమ, నిబంధనలు అమల్లో ఉంటాయి. ఒకవేళ ఎక్స్చేంజ్లో ఈ ఫోన్‌పై కొంటే, రూ.12,200 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. మోటో ఎక్స్ 4 ఫీచర్లు.. గ్లాస్ బాడీ 2.2గిగాహెడ్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ 12 ఎంపీ, 8 ఎంపీ సెన్సార్లతో రియర్ కెమెరా 16 ఎంపీ సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ టైప్-సీ ఛార్జర్ ఈ సూపర్ వాల్యు వీక్‌లోనే మిగతా స్మార్ట్ఫోన్లపై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. బైబ్యాక్ ఆఫర్ కింద షావోమి రెడ్మి నోట్ 4 రూ.5500కు కొనుగోలు చేసుకోవచ్చు. 70 వేల రూపాయల గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ కూడా రూ.10,999కే అందుబాటులో ఉంచింది. ఐఫోన్ 6, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, మోటో ఎక్స్4 వంటి పాపులర్ మొబైల్ ఫోన్లు కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. -
ఫ్లిప్‌కార్ట్‌లో మోటో డేస్
ఫ్లిప్‌కార్ట్‌లో మోటో డేస్ సేల్కు తెరలేసింది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంలో మోటోరోలా మూడు రోజుల పాటు ఈ ప్రమోషనల్ సేల్‌ను నిర్వహిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఫిబ్రవరి 24 వరకు జరుగనుంది. మోటో డేస్ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన మోటోరోలా ఫోన్లు మోటో ఈ4 ప్లస్, మోటో ఎక్స్4, మోటో జెడ్2 ప్లే స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్లో లభించనున్నాయి. మోటో డేస్ ఫ్లిప్‌కార్ట్ సేల్... మోటో ఈ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ.9,499కి లిస్టు చేసింది. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.9,999. అదనంగా ఈ ఫోన్ ఎక్స్చేంజ్పై రూ.2000 తగ్గింపును ఇస్తోంది. దీంతో మొత్తంగా మోటో ఈ4 ప్లస్ ధర రూ.7,499కు దిగొచ్చింది. అయితే ఈ ఎక్స్చేంజ్ కూడా ఎంపిక చేసిన ఫోన్లపైనే ఇస్తారు. ఫైన్ గోల్డ్, ఐరన్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ఈ ఆఫర్ కింద లిస్టు అయి ఉంది. కొత్తగా లాంచ్ అయిన మోటో ఎక్స్4 ధరను కూడా ఫ్లిప్‌కార్ట్ రూ.20,999 నుంచి రూ.18,999కు తగ్గించింది. అదనంగా ఎక్స్చేంజ్పై మరో రెండు వేల రూపాయల తగ్గింపును ఇస్తోంది. మోటో జెడ్2 ప్లేను కంపెనీ గతేడాది లాంచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యంత పాపులర్ ఫోన్‌గా పేరొందింది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.27,999 కాగ, ప్రస్తుతం దీన్ని ఫ్లిప్‌కార్ట్ రూ.22,999కే అందుబాటులోకి తెచ్చింది. అదనంగా ఈ ఫోన్‌పై కూడా రెండు వేల రూపాయల తగ్గింపును ఇస్తోంది. -
మోటో ఎక్స్ 4 కొత్త వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: మోటో ఫ్యామిలీలో మరోకొత్త వేరియంట్ సార్ట్‌ఫోన్ చేరింది. సోమవారం మోటోరోలా కొత్త డివైస్నులాంచ్ చేసింది. మోటో ఎక్స్ 4 6జీబీని మార్కెట్లో విడుదల చేసింది. గత మోటో నవంబర్‌లో వచ్చిన ఎక్స్4 స్మార్ట్‌ఫోన్‌కు తాజాగా 6 జీబీ ర్యామ్ వేరియెంట్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.24,999గా నిర్ణయించింది. జనవరి 31వ తేదీ నుంచి మోటో హబ్స్ , ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభ్యం. లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొంటే రూ.1500 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. అలాగే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.3వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. వొడాఫోన్ నుంచి డేటా ఆఫర్ కూడా లభిస్తుంది. రూ. 199 ప్లాన్‌పై 490 జీబీ డేటాను అలభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్. ఈ ఆఫర్ ఫిబ్రవరి 2(శుక్రవారం)వరకు మాత్రమే లభ్యం. మోటో ఎక్స్4 ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్టీపీఎస్ ఐపీఎస్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12+8 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్. -
మోటో స్పెషల్ స్మార్ట్‌ఫోన్ త్వరలో..
లెనోవా సొంతమైన మోటరోలా కంపెనీ త్వరలోనే ఈ ఏడాదిలో తన మూడవ డ్యూయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. తాజా నివేదికల ప్రకారం మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో ఎక్స్4' పేరుతో నెల 24వ తేదీన విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. అయితే ధర వివరాలు మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ బాడీ, ఫింగర్‌ప్రింట్ ఫీచర్స్‌తో సూపర్ బ్లాక్ లేదా స్టెర్లింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం కానుంది. ఐరోపా, ఉత్తర అమెరికా, ఈ మోటా ఎక్స్ 4 ఫోన్ 3 జీబి ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్గాను, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 4 జీబి ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ తోను రానుంది. అంతేకాదు డిజిటల్ టీవీ ఆప్షన్, స్పెషల్ హైబ్రిడ్ ఎస్‌డీకార్డును పొందుపర్చినట్టు తెలుస్తోంది. మోటో ఎక్స్ 4 ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. మోటో ఎక్స్4 ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 12, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరాలు విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ -
మోటో కొత్త ఫోన్, ధరెంతో తెలుసా?
అద్బుతమైన ఫీచర్లతో సరితూగ తగ్గ ధరలతో మోటోరోలా ఇటీవల సరికొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్4ను కూడా మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు మోటోరోలా సన్నద్ధమవుతోంది. ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ కావడానికి ముందే ధర, ఫీచర్లు లీకయ్యాయి. టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ట్ అనే వ్యక్తి దీని ధర వివరాలను ఆన్లైన్లో లీక్ చేశారు. మోటోరోలా తీసుకురాబోతున్న అప్‌కమింగ్ డివైజ్ మోటో ఎక్స్4, 32జీబీ వేరియంట్ ధర తూర్పు యూరోపియన్ మార్కెట్లో 350 యూరోలు అంటే సుమారు రూ.26,300 వరకు ఉండొచ్చని లీక్చేశారు. ఈ ఫోన్ ధర మోటోరోలా తీసుకొస్తున్న మోటో-ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలకు తగ్గట్టే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మోటోరోలా 2015 నుంచి తీసుకొస్తున్న ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలు రూ.27వేల మధ్యలో ఉన్నాయి. అంతేకాక ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ ఇతర వేరియంట్లను కూడా మోటోరోలా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు క్వాండ్ట్ తెలిపారు. ఈ ఫోన్‌ను ఈ వారం మొదట్లో లాంచ్‌చేసిన మోటో జెడ్2 ఫోర్స్ ఈవెంట్లోనే తీసుకొస్తారని టెక్ వర్గాలు అంచనావేశాయి. కానీ కేవలం మోటో జెడ్2 ఫోర్స్‌ను మాత్రమే కంపెనీ లాంచ్ చేసింది. మోటో ఎక్స్ 4 ఫీచర్లు ఈ విధంగా ఉండబోతున్నాయట... అల్యూమినియం బాడీ డ్యూయల్ కెమెరా సెటప్ 12 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్‌తో రియర్ కెమెరా ఐపీ68 వాటర్ప్రూఫింగ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 చిప్సెట్ 32జీబీ లేదా 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబీ ర్యామ్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ నోగట్