buyback guarantee
-
భారీ ఆఫర్ : ఏడు వేలకు మోటో ఎక్స్ 4
స్టన్నింగ్ ఫీచర్లతో పాటు బ్యాక్ గ్రౌండ్‌ను బ్లర్ చేసుకునే అద్భుతమైన సదుపాయంతో వచ్చిన మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ మోటో ఎక్స్4. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 22,999 రూపాయలు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఏడు వేల రూపాయలకే ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న సూపర్ వాల్యు వీక్‌లో మోటో ఎక్స్ 4 స్మార్ట్‌ఫోన్ 4జీబీ/64జీబీ వేరియంట్ కేవలం ఏడు వేల రూపాయలకే అందిస్తోంది. అది ఎలా అంటే... ‘బైబ్యాక్ ఆఫర్స్’ కింద ఈ ప్రొడక్ట్‌ను కొంటే, రూ.16వేల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.6999కు దిగొస్తోంది. అదేవిధంగా నియమ, నిబంధనలు అమల్లో ఉంటాయి. ఒకవేళ ఎక్స్చేంజ్లో ఈ ఫోన్‌పై కొంటే, రూ.12,200 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. మోటో ఎక్స్ 4 ఫీచర్లు.. గ్లాస్ బాడీ 2.2గిగాహెడ్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ 12 ఎంపీ, 8 ఎంపీ సెన్సార్లతో రియర్ కెమెరా 16 ఎంపీ సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ టైప్-సీ ఛార్జర్ ఈ సూపర్ వాల్యు వీక్‌లోనే మిగతా స్మార్ట్ఫోన్లపై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. బైబ్యాక్ ఆఫర్ కింద షావోమి రెడ్మి నోట్ 4 రూ.5500కు కొనుగోలు చేసుకోవచ్చు. 70 వేల రూపాయల గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ కూడా రూ.10,999కే అందుబాటులో ఉంచింది. ఐఫోన్ 6, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, మోటో ఎక్స్4 వంటి పాపులర్ మొబైల్ ఫోన్లు కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. -
రూ.70 వేల ఫోన్, రూ.11వేలకే!
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్తగా మరో సేల్‌ను ప్రారంభించింది. సూపర్ వాల్యు వీక్ పేరుతో నేటి నుంచి ఈ సేల్కు తెరలేపింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ జూన్ 24 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా కొత్త స్మార్ట్ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బైబ్యాక్ గ్యారెంటీలు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. గూగుల్ పిక్సెల్ 2, ఐఫోన్ 6, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, మోటో ఎక్స్4 వంటి పాపులర్ మొబైల్ ఫోన్లను ఈ సేల్‌లో అందుబాటులో ఉంచింది. ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యు వీక్ సేల్... సూపర్ వాల్యు వీక్ సేల్ కింద, ఫ్లిప్‌కార్ట్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది. బైబ్యాక్ గ్యారెంటీతో పిక్సెల్ 2 128 జీబీ మోడల్ కేవలం 10,999 రూపాయలకే అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 70వేల రూపాయలు. అయితే ఈ ఆఫర్ పొందాలంటే, వినియోగదారులు తొలుత రూ.199తో బైబ్యాక్ గ్యారెంటీ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 9,001 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతో పిక్సెల్ 2 ఫోన్ ధర 60,999 రూపాయలకు దిగొచ్చింది. అదేవిధంగా హెచ్డీఎఫ్ డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు అదనంగా మరో 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌తో పిక్సెల్ 2 ధర రూ.52,999కు తగ్గింది. వీటితో పాటు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో రూ.42 వేల ఎక్స్చేంజ్ వాల్యును కొనుగోలు దారులను పొందుతారు. ఇలా పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999కు పడిపోయింది. పిక్సెల్ 2, 128 జీబీ వేరియంట్‌పైనే కాక, ఫ్లిప్‌కార్ట్ తన పిక్సెల్ 2 ఎక్స్ఎల్ 64 జీబీ మోడల్‌పై కూడా రూ.37 వేల బైబ్యాక్ గ్యారెంటీని ఆఫర్ చేస్తోంది. 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.44 వేల బైబ్యాక్‌ను అందిస్తోంది. ఇదే రకమైన ఆఫర్‌ను మోటో ఎక్స్4కు కూడా అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ రూ.6999కు లభ్యమవుతోంది. ఈ హ్యాండ్సెట్ అసలు ధర 22,999 రూపాలయు. బైబ్యాక్ గ్యారెంటీతో పాటు , ఫ్లిప్‌కార్ట్ పలు స్మార్ట్ఫోన్లపై ‘ఈజీ నో కాస్ట్ ఈఎంఐ’ ను కూడా ఆఫర్‌ను చేస్తోంది. -
స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించేందుకు సిద్దమైంది. తన ప్లాట్ ఫామ్ పై స్మార్ట్ ఫోన్ విక్రయాలను రెండింతలు చేసుకోవాలని నిర్ణయించిన ఫ్లిప్ కార్ట్, 'బై బ్యాక్ గ్యారెంటీ' ప్రొగ్రామ్ తో వినియోగదారుల ముందుకు వస్తోంది. బిగ్ 10 సేల్ లో భాగంగా దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లపై ఈ ప్రొగ్రామ్ లాంచ్ చేయాలని ఫ్లిప్ కార్ట్ నిర్ణయించింది. మోటో జీ5 స్మార్ట్ ఫోన్ పై ఈ ప్రొగ్రామ్ ను మార్చిలో ఈ ఆన్ లైన్ రీటైలర్ తీసుకొచ్చింది. ఇది విజయవంతం కావడంతో మరోసారి దీన్ని లాంచ్ చేయనుందని కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు. ఇలాంటి ప్రొగ్రామ్ తో పాటు, తక్కువ ధరతో ఈఎంఐ, ఇతర ప్రొగ్రామ్స్ కూడా సాధారణంగా విక్రయాలను 50-70 శాతం పెంచుతాయని ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్స్ సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్ రాజగోపాల్ చెప్పారు. సేల్ సమయంలో రెండితలు, రెండింతలకు పైగా పెరుగుదల నమోదవుతుందని తెలిపారు. బై బ్యాక్ గ్యారెంటీ అనేది ఫోన్ కు ఇన్సూరెన్స్ కవర్ కొనడం లాంటిదని అభివర్ణించారు. దేశీయ మార్కెట్ కు బై బ్యాక్ ప్రొగ్రామ్ అనేది కొత్తదని, ఈ సేల్ సమయంలో రూ.10,000 నుంచి రూ.80,000 మధ్యలో ఉండే కనీసం సగం స్మార్ట్ ఫోన్ మోడల్స్ పై బై బ్యాక్ ను ఆఫర్ చేస్తామని రాజగోపాల్ తెలిపారు. ఆరు లేదా ఎనిమిది నెలల్లో కొత్త స్మార్ట్ ఫోన్ కోసం, కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ ను తిరిగి ఇచ్చేసినా, ఎక్స్చేంజ్ చేసుకున్నా ఎంఆర్పీపై 35-50 శాతం మధ్యలో కస్టమర్లకు ఆఫర్ చేస్తామని, అది బైబ్యాక్ గ్యారెంటీ నియమ నిబంధనలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇలాంటి ప్రొగ్రామ్ ప్రస్తుతం భారత్ లో లేదని, ఐఫోన్ లాంటి ధర ఎక్కువ కలిగిన స్మార్ట్ ఫోన్లపైననే అమెరికాలో ఇలాంటి ప్రొగ్రామ్ ఉందని రాజగోపాల్ వివరించారు. ఫ్లిప్ కార్ట్ బిగ్ 10 సేల్ కింద ఆపిల్, శాంసంగ్, మోటోరోలా, లెనోవో లాంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు.