స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్
స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్
Published Fri, May 12 2017 10:01 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించేందుకు సిద్దమైంది. తన ప్లాట్ ఫామ్ పై స్మార్ట్ ఫోన్ విక్రయాలను రెండింతలు చేసుకోవాలని నిర్ణయించిన ఫ్లిప్ కార్ట్, 'బై బ్యాక్ గ్యారెంటీ' ప్రొగ్రామ్ తో వినియోగదారుల ముందుకు వస్తోంది. బిగ్ 10 సేల్ లో భాగంగా దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లపై ఈ ప్రొగ్రామ్ లాంచ్ చేయాలని ఫ్లిప్ కార్ట్ నిర్ణయించింది. మోటో జీ5 స్మార్ట్ ఫోన్ పై ఈ ప్రొగ్రామ్ ను మార్చిలో ఈ ఆన్ లైన్ రీటైలర్ తీసుకొచ్చింది. ఇది విజయవంతం కావడంతో మరోసారి దీన్ని లాంచ్ చేయనుందని కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు.
ఇలాంటి ప్రొగ్రామ్ తో పాటు, తక్కువ ధరతో ఈఎంఐ, ఇతర ప్రొగ్రామ్స్ కూడా సాధారణంగా విక్రయాలను 50-70 శాతం పెంచుతాయని ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్స్ సీనియర్ డైరెక్టర్ అయ్యప్పన్ రాజగోపాల్ చెప్పారు. సేల్ సమయంలో రెండితలు, రెండింతలకు పైగా పెరుగుదల నమోదవుతుందని తెలిపారు. బై బ్యాక్ గ్యారెంటీ అనేది ఫోన్ కు ఇన్సూరెన్స్ కవర్ కొనడం లాంటిదని అభివర్ణించారు. దేశీయ మార్కెట్ కు బై బ్యాక్ ప్రొగ్రామ్ అనేది కొత్తదని, ఈ సేల్ సమయంలో రూ.10,000 నుంచి రూ.80,000 మధ్యలో ఉండే కనీసం సగం స్మార్ట్ ఫోన్ మోడల్స్ పై బై బ్యాక్ ను ఆఫర్ చేస్తామని రాజగోపాల్ తెలిపారు.
ఆరు లేదా ఎనిమిది నెలల్లో కొత్త స్మార్ట్ ఫోన్ కోసం, కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ ను తిరిగి ఇచ్చేసినా, ఎక్స్చేంజ్ చేసుకున్నా ఎంఆర్పీపై 35-50 శాతం మధ్యలో కస్టమర్లకు ఆఫర్ చేస్తామని, అది బైబ్యాక్ గ్యారెంటీ నియమ నిబంధనలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇలాంటి ప్రొగ్రామ్ ప్రస్తుతం భారత్ లో లేదని, ఐఫోన్ లాంటి ధర ఎక్కువ కలిగిన స్మార్ట్ ఫోన్లపైననే అమెరికాలో ఇలాంటి ప్రొగ్రామ్ ఉందని రాజగోపాల్ వివరించారు. ఫ్లిప్ కార్ట్ బిగ్ 10 సేల్ కింద ఆపిల్, శాంసంగ్, మోటోరోలా, లెనోవో లాంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు.
Advertisement
Advertisement