ఆనంద్ మృతదేహం, తీవ్రంగా గాయపడిన విజయ (ఇన్‌సెట్) ఆనంద్ పాతచిత్రం
ఎస్.రాయవరం (పాయకరావుపేట): పుట్టిన రోజు వేడుకతో ఎంతో సందడిగా ఉండాల్సిన ఆ ఇంట మృత్యువు విషాదం నింపింది. ఇంటికి పెద్దదిక్కయిన వ్యక్తిని దూరం చేసింది. వివరాలిలావున్నాయి.పెనుగొల్లు గ్రామా నికి చెందిన పావని (10) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. ఆమె పాలన మేనమామ ఇసరపు ఆనంద్, అమ్మమ్మ నూకాలమ్మ చూస్తున్నారు. ఆనంద్ ఆర్మీ ఉద్యోగి. నాలుగు రోజులక్రితం స్వగ్రామం పెనుగొల్లు వచ్చాడు. శనివారం మేనకోడలు పుట్టిన రోజు కావడంతో సాయంత్రం ఐదు గంటలకు కేక్ తెచ్చేందుకు బైక్‌పై పావని, సోదరుని కుమార్తె విజయ్‌తో అడ్డురోడ్డు బయలుదేరాడు.
జాతీయ రహదారిపై వెళ్తుండగా నాటుబండిని బైక్‌తో ఢీకొన్నాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. పావనికి స్వల్పగాయాలు, విజయకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్.రాయవరం ఎస్‌ఐ కుమారస్వామి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆనంద్ మృతదేహాన్ని నక్కపల్లి 30 పడకల ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు. వేడుకలతో సందడిగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు ఆనం ద్ మృతితో దుఃఖసాగరంలో మునిగి పోయారు. పోషించే దిక్కు కోల్పోవడంతో తమను ఎవరు ఆదుకుంటారని రోదించడం అందరినీ కంట తడి పెట్టించింది. వారిని అదు పు చేయడం ఎవరితరం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment