
రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్న వెంకట్రావు, భాస్కరరావుల మృతదేహాలు
శ్రీకాకుళం, కాశీబుగ్గ: అడ్డదారిలో వెళ్తే వేగంగా ఇంటికి చేరుకోవచ్చుననుకున్న వారిని మృత్యువు రైలు రూపంలో వచ్చి కాటేసింది. కుటుంబ సభ్యుల ను విషాదంలోకి నెట్టేసింది. ఈ దారుణం పలాస–కాశీబుగ్గ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులైన.. టెక్కలికి చెందిన గురుగుబెల్లి వెంకట్రావు (55), కోటబొమ్మాళి మండలం కుజ్జూపేటకు చెందిన కిల్లి భాస్కరరా వు(56)లు మృతి చెందారు. జీఆర్‌ఆర్‌పీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రా వు, భాస్కరరావులు ఇచ్ఛాపురంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు రోజూ స్వగ్రామాల నుంచి విధులకు వెళ్లి వస్తుం టారు. ఆదివారం కూడా విధుల అనంతరం ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఇచ్ఛాపురం నుంచి పలాస రైల్వేస్టేషన్ వరకూ ప్రయాణించా రు.
అక్కడ రైలు దిగిన ఇద్దరూ బస్సును అందుకోవాలనే తొందరలో అసలు దారిని వదిలేసి.. అడ్డదారిలో పట్టాలపై వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారు ప్రయాణించిన ఫలక్‌నుమా రైలువెనుక నుంచి రావడాన్ని ఇద్దరూ గమనించలే దు. ఇంతలో రైలు వచ్చి ఢీకొట్టడంతో వెంకట్రా వు, భాస్కరరావులు సంఘటన స్థలంలోనే మృత్యువాత పడ్డారు. ఇంటికి చేరుకోవాలనే తొందరలోనే ఇద్దరు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తూ చనిపోవడంపై స్థానికులు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. మృతదేహాలను కాశీబుగ్గ జీఆర్ పీ హెడ్‌కానిస్టేబుల్ కోదండరావు పరిశీలించా రు. ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేశారు.
టెక్కలిలో విషాదం
టెక్కలి రూరల్: బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి గురుబెల్లి వెంకట్రావు రైలు ఢీకొన్న సంఘటనలో చనిపోవడంతో టెక్కలిలోని అతని కుటుంబం తీవ్ర విషాదానికి గురైంది. భార్య ఉషారాణి, కూతురు పావణిలు గుండెలు పగిలేలా రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. మృతుడికి శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతను ప్రస్తుతం హైదారాబాద్‌లో ఉంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment