హీరో దునియా విజయ్‌పై కేసు | Case File On Hero Duniya Vijay Karnataka | Sakshi
Sakshi News home page

హీరో దునియా విజయ్‌పై కేసు

Published Fri, Jun 1 2018 7:00 AM | Last Updated on Fri, Jun 1 2018 9:19 AM

Case File On Hero Duniya Vijay Karnataka - Sakshi

దునియా విజయ్‌ (ఫైల్‌)

బనశంకరి: పోలీసుల విధులకు అడ్డుపడి మాస్తిగుడి సినిమా నిర్మాత సుందరగౌడ పారిపోవడానికి సహకరించారని కన్నడ హీరో దునియా విజయ్‌పై బెంగళూరులో చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. తావరకెరె హెడ్‌కానిస్టేబుల్‌ గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఏం జరిగిందంటే...
వివరాలు... 2016 నవంబర్‌లో తావరకెరె పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తిప్పగొండనహళ్లి జలాశయం వద్ద దునియా విజయ్‌ హీరోగా సుందర్‌గౌడ నిర్మిస్తున్న మాస్తిగుడి సినిమా షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ సమయంలో విలన్లుగా నటిస్తున్న ఉదయ్, అనిల్‌ ఇద్దరు హెలికాప్టర్‌ నుంచి జలాశయంలో దూకే సన్నివేశంలో నటిస్తూ నీటమునిగి మరణించడం తెలిసిందే. దీనిపై తావరకెరె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిర్మాత సుందర్‌గౌడపై జామీను రహిత వారెంట్‌ జారీ అయింది. బుధవారం తావరకెరె పోలీసులు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పీఎస్‌ పరిధిలో ఉన్న సుందర్‌గౌడ ఇంటికి వెళ్లి అరెస్ట్‌ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా అక్కడ కనబడిన దునియా విజయ్‌ పోలీసులతో మాట్లాడుతుండగా సుందర్‌గౌడ చాకచక్యంగా తప్పించుకున్నారు. సుందర్‌గౌడ పరారీకి దునియా విజయ్‌ పరోక్షంగా సహకరించడంతో పాటు పోలీసుల విధులకు అడ్డుపడ్డారని హెడ్‌కానిస్టేబుల్‌ గోవిందరాజు గురువారం పిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement