
సాక్షి, మేడ్చల్ : డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల విహార్ కాలనీలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన పైళ్ల దివ్య (20).. అదే గ్రామానికి చెందిన బుగ్గ నవీన్ (23)ను గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. తల్లిదండ్రులతో కలిసి విహార్ కాలనీలో నివాసముంటున్న ఆమె నిన్న రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేసుకోవడానికి నవీన్ నిరాకరించడంతోనే దివ్య ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment