సాక్షి, చిత్తూరు : జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఏర్పేడు మండలం ల్యాంకో ఫ్యాక్టరీ సమీపంలో ఆగివున్న లారీని ఓ కారు వేగంగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని, శ్రీకాళహస్తి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడు సుందరమూర్తిగా పోలీసులు గుర్తించారు. వీరంతా తమిళనాడుకు చెందినవారుగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment