
హైదరాబాద్: ప్రముఖుల ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న కర్రి సత్తి ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడుకు చెందిన పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ. కోటి విలువ చేసే డైమండ్స్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్రి సతీష్, నరేంద్ర నాయక్, శ్రీనివాస్, సుధీర్ కుమార్ రెడ్డిలు దోచుకున్న సొమ్మును అమ్మడానికి ముంబాయి వెళ్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు.
చంచల్‌గూడ జైలులో 2014లో నలుగురు నిందితులు కలిశారని, జైలు నుంచి బయటకు వచ్చాక ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీటీవీ కెమెరాలు లేని ఇండ్లను ఈ ముఠా టార్గెట్‌గా చేసుకునేదని, టెక్నాలజీకి దొరక్కుండా చేతులకు గ్లోవ్స్ తొడుక్కునేవారని వెల్లడించారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment