నగదు కవర్‌ లాక్కెళ్లిన దొంగలు | Money Robbery in Prakasam | Sakshi
Sakshi News home page

కేటుగాళ్లు

Published Thu, Sep 12 2019 12:15 PM | Last Updated on Thu, Sep 12 2019 12:15 PM

Money Robbery in Prakasam - Sakshi

కవర్‌ లాక్కెళ్లింది ఇక్కడే (బాధితురాలి నివాసం)

ప్రకాశం, తాళ్లూరు: అప్పుడే బ్యాంకులో నగదు డ్రా చేసుకుని ఇంటికి వస్తున్న మహిళ నుంచి ఇద్దరు కేటుగాళ్లు కవర్‌ లాక్కెళ్లారు. అందులో సుమారు రూ.90 వేల నగదు, సెల్‌ఫోన్, బ్యాంకు పాస్‌పుస్తకం ఉన్నాయి. ఈ సంఘటన మండలంలోని తూర్పు గంగవరంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బొలినేని సుబ్బరత్నం స్థానిక ఆంధ్రా బ్యాంకుకు వెళ్లి రూ.90 వేల నగదు డ్రా చేసుకుని ఆ నగదును చిన్న బ్యాగులో పెట్టుకుని పోస్టాఫీస్‌ పక్కన ఉన్న నివాసానికి బయల్దేరింది. దాహంగా ఉండటంతో మధ్యలో కొబ్బరి బొండా తాగింది. నివాసం సమీపంలోకి వచ్చి గేటు తీస్తున్న సమయంలో అప్పటి వరకు అక్కడే చెట్టు కింద బైక్‌పై సెల్‌ చూసుకుంటూ ఉన్న ఇద్దరు యువకులు ఆమె వద్దకు వచ్చారు.

గ్రామంలో ఉన్న ఒక ఇంటి పేరు, కులం పేరుతో సుబ్బరత్నమ్మను చిరునామా అడిగారు. ఆ ఇంటి పేరు ఉన్న వారు ఆ కులంలో లేరని చెబుతుండగానే ఆమె చేతిలో ఉన్న చిన్న బ్యాగును లాక్కొని బైక్‌పై వేగంగా బొద్దికూరపాడు వైపు వెళ్లారు. షాక్‌కు గురైన మహిళ తక్షణమే తేరుకుని కేకలు వేయడంతో సమీపంలోని బంధువులు, రైతులు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు కలియదిరిగారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బ్యాగులో ఉన్న సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బొద్దికూరపాడు వైపు పరిశీలిస్తూ వెళ్లారు. అప్పటికే నిందితులు పారిపోయారు. వీధి ప్రారంభం పంచాయతీ కార్యాలయం వద్ద బట్టల దుకాణం యజమాని ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలో పుటేజీని పరిశీలించి అప్పడు ఆ దారిలో వెళ్లిన యువకుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement